ప్రతీ ఇంటికి నీరు-ప్రతీ కాలనీకి రోడ్డు:తీగల కృష్ణారెడ్డి

మహేశ్వరం నియోజకవర్గంలోని అన్ని కాలనీలకు రోడ్డు సౌకర్యం కల్పించనున్నట్టు ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి తెలిపారు. బాలపూర్ మండలం బడంగపేటలోని లక్ష్మీదుర్గా హిల్స్ కాలనీలో బీటీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. 10 లక్షల రూపాయల వ్యయంతో ఈ పనులను చేపడుతున్నట్టు ఆయన వెల్లడించారు. ఒకప్పుడు శివారు ప్రాంతాలుగా ఉన్న ప్రదేశాలు ఇప్పుడు కాలనీలుగా రూపాంతరం చెందాయని ఇక్కడి ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నట్టు తీగల చెప్పారు. తెలంగాణలోని ప్రతీ ఇంటికి మంచినీటి సౌకర్యం కల్పించే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషిచేస్తున్నారని అన్నారు. కాలనీ సంక్షేమంకోసం తమ అహర్నిశలు కృషిచేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఎప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.
స్థానిక కాలనీ వాసుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రోడ్డు సౌకర్యం కల్పించిన ఎమ్మెల్యే, కౌన్సిలర్ తో పాటుగా ఇతర ప్రజాప్రతినిధులకు కాలనీ సంక్షేమ సంఘం తరపున అధ్యక్షుడు నర్సింహ్మాగౌడ్ కృతజ్ఞతలు తెలిపార. రోడ్డు లేక చాలాకాలంగా ఇబ్బందులు పడిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో సామా నర్సింహ్మా గౌడ్, సీహెచ్.కృష్ణారెడ్డి, భీంరెడ్డి స్వప్నా జగన్ రెడ్డి, జనార్థన్ రెడ్డి, రామమూర్తి, పవన్ కుమార్, జే.కే.మిశ్రా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *