సిక్కుల ఊచకోత కేసు పునర్విచారణ

ఇందిరా గాంధీ హత్య తరువాత సిక్కుల ఊచకోత కేసులను తిరిగి విచారించేందుకు సిట్ ను ఏర్పాటు చేశారు. ముగ్గురితో కూడిన ఈ బృందం నాటి ఘటనకు సంబంధించిన 186 కేసులను తిరిగి విచారిస్తుంది. దీనికి జస్టిస్ ఎస్.ఎస్. ధింగ్రా నేతృత్వం వహిస్తున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజ్ దీప్ సింగ్, ఐపీఎస్ అధికారి అవిషేక్ డుల్లార్ లు ఇందులో సభ్యులుగా ఉన్నారు. సిక్కుల ఊచకోత కేసుపై సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన సుప్రీం కోర్టు ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం రెండు నెలల్లోగా సుప్రీంకోర్టుకు మధ్యంతర నివేదికను అందచేయనుంది.
1984లో ఇందిరా గాంధీని ఆమె సిక్కు అంగరక్షకులు హత్య చేసిన తరువాత సిక్కులపై దాడులు జరిగాయి. ఢిల్లీతో పాటుగా హర్యానా, పంజాబ్ లలో కూడా సిక్కులపై దాడులు జరిగాయి. ఢిల్లీలోని సిక్కులను ఊచకోత కోశారు. నాటి హింసాకాండలో 2733 మంది ప్రాణాలు కోల్పోయారు. సిక్కులపై జరిగిన నాటి దాడులతో కాంగ్రెస్ నేతలకు సంబంధం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి 250 కేసులు నమోదు కాగా వాటిలో 9 కేసులు విచారణలో ఉన్నాయి. మిగతా కేసులను మూసివేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *