ఢిల్లీలో ఆర్మీ జవాన్ల విన్యాసాల్లో అపశృతి చోటుచేసుకుంది. జనవరి 15న ఆర్మీ డేను పురస్కరించుకుని నిర్వహించే పెరేడ్ కు తయారవుతున్న ఆర్మీ జవాన్లు విన్యాసాలు చేస్తున్న సమయంలో హెలిక్యాఫ్టర్ నుండి ముగ్గురు జవాన్లు కిందపడిపోయారు. హెలిక్యాఫ్టర్ నుండి కిందకు దిగే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కింద పడ్డ ముగ్గురు జవాన్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. జవాన్లు కిందికి దిగుతున్న తాడు ఎందుకు తెగిపోయిందనే దానిపై ఆర్మీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సాధారణ విన్యాసాల్లో భాగంగానే ఈ ఘటన చోటుచేసుకుందని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *