ఆపన్నులకు అభయహస్తం..

కొత్త సంవత్సరం తొలిరోజును సంతోషంగా గడిపేందుకే అందరూ ప్రాధాన్యం ఇస్తారు. కుటుంబంతో బయటకి వెళ్లడం, రోజంతా హాయిగా ఎంజాయ్ చేయడానికే మక్కువ చూపిస్తారు. అయితే తమ సంతోషం కన్నా మన పక్కనున్న వారినికూడా సంతోషపెట్టాలనే ఆలోచన చాలా కొద్దిమందిలోనే ఉంటుంది. దేవుడు మనకిచ్చిన వనరుల్లో కొద్దిగా ఇతరులకు కూడా పంచాలని మంచి సంకల్పంతో ఎవరూ లేని అనాధలకు ఆనందం పంచడానికి బయలుదేరారు. మొక్కుబడిగా వారికి నాలుగు కేకు ముక్కలు ఇచ్చి బయటపడడం కాకుండా మీకు మేమున్నాం అనే భారోసా కల్పించేందుకు కొన్ని కుటుంబాలు నడుం కట్టడం నిజంగా అభినందనీయం. కేవలం నేను నా కుటుంబ అనుకోకుండా ఎవరూ లేని వారికి మేమున్నాం అనే గుండె ధైర్యాన్ని ఇచ్చారు. ఇటువంటి మంచి సంస్కృతి ఇటీవల కాలంలో పెరగడం అభినందనీయం.
వనస్థలీపురం కు చెందిన విజయరాఘవన్ కుటుంబం సామ నగర్ లోని ఆరాధనా ఫాండషన్ లోని పిల్లలతో గడిపితే డి.ఎస్.ఆర్.కే.నెహ్రు కుటుంబం గడ్డీఅన్నారంలోని రెడ్ క్రాస్ సొసైటిలోని చిన్నా పెద్దలతో ఆనందం పంచుకుంది. దిల్ షుఖ్ నగర్ కు చెందిన శేఖర్ అతని మిత్రులు రోడ్లపై ఉన్న వారికి దుప్పట్లు పంచగా, ఉప్పల్ కు చెందిన శ్రీనివాస్ మిత్ర బృందం అన్నాదాన కార్యక్రమాన్ని చేపట్టారు.
స్వాతి, మమతా, చందన , అంజి. అనే చిన్నారులతో తాము రోజంగా ఆనందంగా గడిపినట్టు విజయ్ రాఘవన్ తెలిపారు. తమ పిల్లలతో వారు ఆనందంగా ఆడిపాడారని కొత్త సంవత్సరాన్ని వారితో కలిసి జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. పిల్లలకు చిన్నప్పటి నుండే సోటివారికి సహాయపడాలనే ఆలోచన కలగజేయాల్సిన అవసరం ఉందన్నారు విజయ్.
గత కొద్ది సవంత్సరాలుగా అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న డి.ఎస్.ఆర్.కే. నెహ్రు కుటుంబం గడ్డీఅన్నారంలోని రెడ్ క్రాస్ సొసైటిలోని పిల్లలకు చదువుకు అవసరమైన స్టేషనరీని పంచడంతో పాటుగా పెద్దలకు స్వేట్టర్లను ఇచ్చింది. కొత్త సంవత్సరంతో పాటుగా తన జన్మదినంకూడా కలిసిరావడంతో ప్రతీ ఏదాడి ఇదే విధంగా అవసరమైన వారికి సహాయపడడం తనకు ఆనందంగా ఉంటుందని నెహ్రు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *