ఘాట్ రోడ్లో ఘోర ప్రమాదం 5గురు మృతి

తూర్పుగోదావరి మన్యం ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 5గురు మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి. మారేడు మిల్లి-చింతూరు ఘాట్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. 11 మందితో ప్రయాణిస్తున్న టాటా వాహనం అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదంలో జరిగింది. ఘాట్ రోడ్డు మలుపులో డ్రైవర్ వాహనాన్ని అదుపుచేయలేకపోవడంతో వాహనం లోయలో పడిపోయినట్టు స్థానికులు తెలిపారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడానికి కారణాలు ఏమిటదేని స్పష్టంగా తెలియడం లేదు. వాహనంలో సాంకేతిక సమస్యా లేక డ్రైవర్ నిర్లక్ష్యమా అనేది తేలాల్సి ఉంది. గాయపడ్డవారిని కాకినాడ ఆస్పత్రికి తరలించారు. హుటాహుటిన ఘటనా స్థాలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలను చేపట్టారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అధికారులను ఆదేశించారు. పోలీసులతో పాటుగా ప్రత్యేక బృందాలు కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *