ప్రాజెక్టుల పనులను పరిశీలించిన సీఎం

పలు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులను స్వయంగా పరిశీలిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండవ రోజు కూడా ప్రాజెక్టులను పరిశీలించి నిర్మాణ పనులగురించి అధికారులను అడిగితెలుసుకున్నారు. పెద్ద జిల్లా నందిమేడారం పంప్ హౌస్ పనులను పరిశీలించిన ఆయన పనులను మరింత వేగంగా పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. పంప్ హౌస్ నిర్మాణం గురించి ఇంజనీరింగ్ అధికారులు సీఎంకు వివరించారు. అక్కడి నుండి రామడుగు మండలం లక్ష్మీపూర్ కు వచ్చిన సీఎం ఇక్కడ జరుగుతున్నసొరంగం పనులను పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు గ్రావిటీ కాల్వ సొరంగం పనులు ఇక్కడ జరుగుతున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం మిడ్ మానేరు ప్రాజెక్టుల పనుల విషయంలో ఏమాత్రం అలక్షం చూపించవద్దని సీఎం అధికారులకు దిశానిర్థేశం చేశారు. పనులను సకాలంలో పూర్తిచేయాలన్నారు. దీనికోసం మూడు షిప్టులలో పనిచేయాలని సూచించారు.
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *