చంద్రబాబుకు ఆస్తుల కంటే అప్పులే ఎక్కువ

అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆస్తుల కంటే అప్పులే ఎక్కువ ఉన్నాయి. చంద్రబాబు కుటుంబ సభ్యల ఆస్తులకు సంబంధించిన వివరాలను ఆయన తనయుడు లోకేశ్ మీడియాకు వివరించారు. దేశంలో మరే ఇతర రాజకీయ కుటుంబం చేయని విధంగా తాము ఆస్తులను ప్రకటిస్తున్నామని వరుసగా ఏడోసారి ఆస్తుల వివరాలను ప్రజలు వెల్లడిస్తున్నట్టు లోకేశ్ తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి 2.53 కోట్ల ఆస్తులు ఉండగా 3.5 కోట్ల రూపాయల వరకు అప్పులున్నాయి. చంద్రబాబు భార్య భూనేశ్వరి ఆస్తి 25.41ే కోట్లు, లోకేశ్ ఆస్తులు. 15.21 కోట్లు, బ్రాహ్మణి ఆస్తులు 15.01 కోట్లు, దేవాన్ష్ ఆస్తులు 11.54 కోట్లు. ప్రస్తుతం తాము ప్రకటించిన ఆస్తులు కొనుగోలు ధరలనే ప్రకటిస్తున్నామని మార్కెట్ ధరల ప్రకారం కాదని లోకేశ్ స్పష్టం చేశారు.
తమ కుటుంబానికి హెరిటేజ్ సంస్థ నుండే ఆదాయం వస్తోందని ఆయన ప్రకటించారు. రాజకీయాల్లో ఉన్నవారు రాజకీయాల ద్వారానే ఆదాయం పొందకూడదని తన కోరుకుండేవారని అందుకే హెరిటేజ్ సంస్థను స్థాపించి దాని ద్వారా ఆదాయం పొందుతున్నామని చెప్పారు. హెరిటేజ్ సంస్థ ప్రభుత్వం నుండి ఎటువంటి రాయితీలు పొందకుండా స్వతంత్రంగా వ్యాపారం చేస్తోందని అన్నారు. తమని విమర్శించే వారు తమ ఆస్తులను ఎందుకు ప్రకటించడం లేదని లోకేశ్ ప్రశ్నించారు. దమ్ముంటే వారు కూడా ఆస్తులను ప్రకటించాలని సవాల్ చేశారు. తమ ఆస్తులపై 27 కేసులు వేసినా ఏమీ కోర్టుల్లో నిలబడని సంగతిని లోకేశ్ గుర్తుచేశారు.Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nfl jersey cheap Philadelphia Eagles jersey china