ప్రాజెక్టులను పరిశీలించిన సీఎం కేసీఆర్

తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఎటువంటి అలసత్వం వద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు చెప్పార. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నకాళేశ్వరంతో పాటుగా ఇతర సాగునీటి ప్రాజెక్టుల పనులను స్వయంగా పరిశీలించేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి ఈ ఉదయం కరీంనగర్ నుండి ప్రాజెక్టుల పరిశీలనకు శ్రీకారం చుట్టారు. అంతకు ముందు సాగునీటి అధికారులతో సీఎం ప్రాజెక్టుల స్థితిగతులను తెలుసుకున్నారు. సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఎటువంటి జాప్యాన్ని సహించేది లేదని సీఎం చెప్పారు. అనుకున్న సమయానికి సాగునీటి ప్రాజెక్టులు అన్నీ పూర్తి కావాలన్న సీఎం సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తేవాలన్నారు. జయశంకర్ భూపాలపల్లిలోని మేడిగడ్డ బ్యారెజ్ పనులను పరిశీలించిన సీఎం కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద పనులు జరుగుతున్నతీరును గమనించారు. అనకట్ట పనులు ఎంతవరకు వచ్చింది. పనులు ఏవిధంగా జరుగుతున్నాయే సీఎం పరిశీలించారు. పనుల ప్రగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏ పనులు ఎంతవరకు వచ్చింది. పూర్తి కావడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది అన్న విషయాలను గురించి సీఎం అధికారల వద్ద నుండి సమాచారాన్ని సేకరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట మంత్రులు హరీశ్‌రావు, ఈటలరాజేందర్, చీఫ్‌ విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీలు వినోద్, బాల్కసుమన్, డీజీపీ మహేందర్‌రెడ్డి లతో పాటుగా ఇతర ఉన్నాతాధికారులు ఉన్నారు.Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Eagles jersey cheap Philadelphia Eagles jersey china