ఎవరీ రోహ్యంగాలు-వారంటే ఎందుకంత భయం…

మయన్మార్ కు చెందిన రోహ్యంగాలది నిజంగానే అత్యంత ప్రమాదకరమైన జాతా… ఇప్పుడు ఈ అనుమానాలు అనేక మంది మెదళ్లను తొలుస్తున్నాయి. దీనికి తోడు సమాజిక మాధ్యమాల్లో ఈ జాతిపై వస్తున్న వార్తలు మరింత గందరగోళానికి తెరతీస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న వారిలో రోహ్యంగాలు కూడా ఉన్నారు. మయన్మార్ సైనికులు సాగిస్తున్న హింసాకాండకు వేలాది మంది బలికాగా లక్షలాది మంది పొట్ట చేత పట్టుకుని పొరుగు దేశాలకు వసల పోయారు.
అసలీ రోహ్యంగాలు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం కావాలంటే 15వ శతాబ్దానికి వెళ్లాల్సిందే. ఆ కాలంలో అనేక మంది అరబ్బు దేశాల నుండి వ్యాపారం కోసం నాటి బర్మాకు వచ్చారు. అక్కడి నుండి ప్రస్తుతం బాంగ్లాదేశ్ లో ఉన్న చిట్టాంగ్ ప్రాంతం వరకు విస్తరించారు. బర్మాలోని రఖైనా రాష్ట్రంలో వీరి ప్రాబల్యం ఎక్కువ. వీరు ఆటవిక తెగకు చెందిన వారు మాత్రం కాదు.
మయన్మార్ లో బౌద్దులు ఎక్కువ. రోహ్యంగాలు అంతా ముస్లీంలు. రఖనా ప్రాంతాన్ని నాటి తూర్పు పాకిస్థాన్ లో కలపాలంటూ అప్పట్లో వీరు ఆందోళన చేశారు. మొదటి నుండి స్థానికులకు వీరికి అసలు సఖ్యత లేదు. మత,సాంస్కృతిక విభేదాల వల్ల బౌద్దులతో వీరికి సరిపడేదికాదు.
ముస్లీంల ప్రాబల్యం ఎక్కువ గా ఉన్న ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తికావాలంటూ వీరు ఆందోళనలు చేశారు. ఈ క్రమంలో జరిగిన హింసాత్మక ఘటనల్లో సైనికులు, పోలీసులపై రోహ్యంగాలకు చెందిన మిలిటెంట్ గ్రూపులు దాడులకు తెగబడ్డాయి. వీటిలో అనేక మంది చనిపోవడంతో మయన్మార్ సైన్యం వీరిని ఉక్కుపాదంతో అణచివేయడం మొదలు పెట్టింది.
సైనిక చర్యల్లో రోహ్యంగాలకు చెందిన ఊళ్లకు ఊళ్లు తగులబడ్డాయి. ఆడవారిపై దాడుణంగా అత్యాచారాలు జరిగాయి. చిన్నపిల్లలనే కనికరం కూడా లేకుండా అనేక మంది పిల్లలను కూడా మయన్మార్ సైన్యం చంపేసింది. దీనితో ప్రాణాలకు అరచేతిలో పెట్టుకుని పొరుగున బాంగ్లాదేశ్ తో పాటుగా భారత్ లోకి రోహ్యింగాలు ప్రవేశించారు.
భారత్ లో వీరు జమ్ముకాశ్మీర్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, పశ్చిమ బెంగాల్, తెలంగాణ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. శాంతిభ్రతల దృష్ట్యా వీరిని తిరిగి స్వదేశానికి పంపేయాలని భారత్ నిర్ణయించింది. అయితే వీరికి మద్దతుగా పలు ముస్లీం సంఘాలు రంగంలోకి దిగడంతో ఇది రాజకీయ రంగు పులుముకుంది. కొంత మంది సుప్రీం కోర్టును సైతం ఆశ్రయించారు.
ఇదే సమయంలో రోహ్యింగాలపై అనేక ప్రచారాలు మొదలయ్యాయి. మయన్మార్ లో వీరు అనేక మంది చంపెశారని, నరమాంస భక్షకులని, ఆటవికులని ప్రచారం సాగుతోంది. అయితే ఇవి వాస్తవం కానప్పటికీ శాంతిభద్రతల నేపధ్యంలో వీరిని తిప్పిపంపాల్సిందేననే ప్రభుత్వం చెప్తోంది. వీరిలో కొంత మందికి తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *