రాజ్యాంగ ధర్మాసనానికి శబరిమల కేసు

ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం పై ఉన్న నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్ ను సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది. ఈ కేపు విచారణ జరిపిన సుప్రీంకోర్టు కేసును ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాతో సహా ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారణ జరిపిన తరువాత కేసును ఐదురుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్టు చెప్పారు. శబరిమల ఆలయంలోకి 10 నుండి 50 సంవత్సరాల మధ్య వయసున్న మహిళల ప్రవేశం ఉన్న నిషేధాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైన సంగతి తెలిసిందే. రాజ్యాంగం ప్రకారం పురుషులతో పాటుగా మహిళలకు సమాన హక్కులు ఉన్న నేపధ్యంలో ఆలయంలోకి మహిళలను రాకుండా ఏవిధంగా అడ్డుకుంటారంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ కేసును విచారించిన కోర్టు భారత రాజ్యాంగం ప్రకారం పురుషులతో సమానంగా మహిళలకు హక్కులు ఉన్నప్పుటు వారిని ఆలయంలోకి రానీయకుండా ఎట్లా అట్టుకుంటారంటూ శబరిమల ఆలయ బోర్డును ప్రశ్నించింది. ఈ కేసు విచారణ సంబద్భంగా 6 సందేహాలను లేవనెత్తిన కోర్టు ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *