ఆఖరి టి20 మ్యాచ్ రద్దు

భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగాల్సిన ఆఖరి టి20 మ్యాచ్ రద్దయింది. దీనితో ఈ మ్యాచ్ పై ఆశలు పెట్టుకున్న అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఉప్పల్ స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మొదటి టి20లో మ్యాచ్ లో భారత్ ఘనవిజయం సాధించగా రెండవ మ్యాచ్ లో భారత్ ఓడిపోయింది. సిరీస్ లో ఆఖరి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతుందని ఆశించి పెద్ద సంఖ్యలో స్టేడియంకు తరలివచ్చిన అభిమానులు నిరాశగా వెనక్కి తిరిగివెళ్లారు. ఆఖరి మ్యాచ్ రద్దు కావడంతో టి 20 సిరీస్ డ్రా అయింది. గత 10 రోజులుగా హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు అవుట్ ఫీల్డ్ తడిగా మారింది. దీన్ని పొడిగా మార్చేందుకు చేసిన ప్రయత్నాలు వృద్ధా అయ్యాయి. వర్షం పడకపోయినప్పటికీ అవుట్ ఫీల్డ్ ఆటకు ఏమాత్రం అనుకూలంగా లేకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మ్యాచ్ లో ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దయిపోయింది. మ్యాచ్ కోసం ఉప్పల్ కు తరలివచ్చిన ప్రేక్షకులు ఉసురుమనుకుంటూ ఇంటి ముఖం పట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *