బెంగళూరు రోడ్లపై జలకన్య

బెంగళూరు నగరంలోని ఒక ప్రధాన రహాదారిపై జలకన్య ప్రత్యక్షమైంది. జలకన్యను రోడ్డుపై ఉన్న నీటి గుంట వద్ద చూసిన ప్రజలు ఎక్కడివారక్కడ ఆగిపోయారు. బెంగళూరు రోడ్ల దుస్థితిపై నిరసన తెలపడానికే ఓ యువతి జలకన్య వేషంలో వచ్చి నిరసనకు దిగింది. బెంగళూరు రోడ్లు దారుణంగా తయారయ్యాయి. రోడ్ల పై గుంతలు పడి నీళ్లు నిలుస్తుండడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల పరిస్థిని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నంలో ఆందోళన చేస్తున్న కొంత మంది ఒక యువతికి జల కన్య వేషం వేయించుకుని వచ్చారు. బెంగళూరు రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయాయని ఇవి మనుషులకు కాకుండా జలకన్యలకు ఆవాసంగా పనికి వస్తాయంటూ వారు ఆందోళన నిర్వహించారు.
దేశ ఐటీ హబ్ గా పేరుగాంచిన బెంగళూరులో రోడ్ల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. నిత్యం లక్షలాది వాహనాలతో కిటకిటలాడే బెంగళూరు రోడ్లపై నర్షం వచ్చిందటే చాలు అవి చిన్న సైజు తటాకాలుగా మారిపోతున్నాయి. ట్రాఫిక్ సమస్యలకు పెట్టింది పేరైన బెంగళూరులో రోడ్ల పరిస్థితి తో ట్రాఫిక్ మరింత అధ్వాన్నంగా మారింది. గంటలతరబడి ట్రాఫిక్ జాం అవుతుండడంతో ప్రజలు నరకయాతన పడుతున్నార. రోడ్లను వెంటనే మరమత్తులు చేయాలని ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nfl jerseys wholesale nfl Eagles jersey