శ్రీశైలంలో కృష్ణమ్మ పరవళ్లు

శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. మూడు సంవత్సరాల తరువాత శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను గురువారం ఎత్తారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమ శ్రీశైలం ప్రాజెక్టు వద్ద పూజలు నిర్వహించి నీటిని నాగర్జున సాగర్ కు విడుదల చేశారు. ప్రస్తుతం రెండు గేట్లను పది అడుగల మేరకు ఎత్తారు. ప్రాజెక్టులోకి వస్తున్న నీటి ప్రవాహాన్ని బట్టి మరిన్ని గేట్లు ఎత్తే అవకాశాలను ప్రాజెక్టు అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుండి 1,39,007 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలో 884.80 అడుగుల నీటి మట్టం ఉంది. రెండు గేట్లను ఎత్తడం ద్వారా 56 వేల క్యూసెక్కుల నీటిని నాగుర్జున సాగర్ కు వదిలారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

cheap Philadelphia Eagles jersey jersey for cheap