ముగిసిన రాష్ట్రపతి ఎన్నికలు

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేస్తున్న ప్రధాని మోడి.

రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ తరపున బీహార్ గవర్నర్ గా ఉన్న రామ్ నాథ్ కోవింద్ పోటీ చేయగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ బరిలోకి దిగారు. ఎన్టీఏ తరపున రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు బీహార్ గవర్నర్ పదవికి రాజీనామా చేసి రామ్ నాథ్ ఎన్నికల్లో పోటీకి దిగారు. ఎన్డీఏ వ్యూహాత్మకంగా దళిత అభ్యర్థిని రంగంలోకి దింపడంతో విపక్షాలు కూడా దళిత మహిళా అభ్యర్థి మీరా కుమార్ ను తమ అభ్యర్థిగా ఎంపిక చేసింది. రాష్ట్రపతి ఎన్నికల్లో లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో పాటుగా రాష్ట్రాల ఎమ్మెల్యేలకు ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రోల్ కాలేజీగా పిల్చుకునే వీరు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ప్రస్తుత బలాబలాను చూస్తే రామ్ నాథ్ కే మొగ్గు కనిపిస్తుంది. ఎలక్ట్రోల్ కాలేజీలో ఎన్డీఏ కు పూర్తి ఆధిపత్యం ఉంది. ఎన్డీఏతో పాటుగా తటస్థ పార్టీలు కూడా రామ్ నాథ్ కు మద్దతు పలికాయి.
రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీలు విప్ జారీ చేసే అధికారం లేదు. దీనితో అభ్యర్థులు తమకు నచ్చిన వారిని ఎంపిక చేసుకోవచ్చు. ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థి పక్కన ఉన్న గడిలో ప్రత్యేకంగా ఎన్నికల సంఘం ఇచ్చిన పెన్ తో మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సి ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా ఆయన మంత్రి వర్గ సహచరులు విపక్ష నేతలు పార్లమెంటులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు జులై 20 విడుదల చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *