హైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తోంది. ఉదయం నుండీ నగరంలో చిరు జల్లులు కురుస్తూనే ఉన్నా సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం పడింది. భారీ వర్షానికి నగరంలోని రోడ్లు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి కూడా నీళ్లు వచ్చాయి. వర్షం ఇప్పటికీ కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. నీళ్లు నిల్చిపోకుండా డ్రైనేజీలు బ్లాక్ కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ముంపు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. రోడ్లపైకి నీళ్లు చేరడంతో పలు చోట్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఎర్పడింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిల్చిపోయాయి. ట్రాఫిక్ ను క్రమబద్దీకరించే పనిలో పడ్డారు అధికారులు. నగరంలోని దిల్ షుఖ్ నగర్, నాగోల్,ఎల్బీనగర్,ఉప్పల్, రామంతపూర్, బేగంపేట, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహీల్స్, కూకట్ పల్లి లతో పాటుగా పాతబస్తీలోనూ భారీగా వర్షం పడుతోంది. జోరువానలోనే పాతబస్తీలో ఘటాల ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *