యూపీలో దారుణం-పులులకు ఆహారంగా వృద్ధులు

పేదరికం మనిషితో ఎంతటి దారుణాలైనా చేయిస్తుంది… పెదరికంలో మగ్గడం కన్నా పులులకు ఆహారం అవడానికి కూడా సిద్ధపడుతున్న దారుణ ఘటనలు ఉత్తర్ ప్రదేశ్ లోని పిలిబిత్ లో చోటు చేసుకుంటున్నాయి. స్థానిక టైగర్ రిజర్వ్ లో ప్రభుత్వ పరిహారం కోసం పులులకు ఆహారంగా మారడానికి కూడా గ్రామాల్లోని వృద్దులు సిద్ధపడుతున్నారట. మనసును కదిలించే ఈ దారుణాలను స్థానిక అటవి శాఖ అధికారులు వెలుగులోకి తెచ్చారు. టైగర్ రిజర్వ్ లో పులులు ఎవరిపైనా దాడి చేసి చంపేస్తే వారికి ప్రభుత్వం పరిహారం ప్రకటిస్తుంది. దీని కోసం ఆశపడి పులులకు ఆహారం కావడానికి టైగర్ రిజర్వ్ సమీప గ్రామాల్లోని వృద్దులు సిద్ధపడుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. పేదరికంలో బతికేకంటే పులులలకు ఆహారంగా మారి వాటి కడుపు నింపడంతో పాటుగా కుటుంబ సభ్యులకు పరిహారం వచ్చి వారి జీవితాలు బాగుపడతాయనే ఆలోచనతో పులులకు ఆహారం అయ్యేందుకు సిద్ధపడుతున్న వైనాన్ని అధికారులు గుర్తించారు.

అటవీశాఖ అధికారుల కథనం ప్రకారం ఈ సంవత్సరం ఫిబ్రవరి నుండి ఇప్పటివరకు 7గురు వృద్దులను పులులు చంపినట్టు ఫిర్యాదులు అందాయి. వీటిపై దరయాప్తు జరిపిన అధికారులకు విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. టైగర్ రిజర్వ్ లో చనిపోయిన వారికి ప్రభుత్వం ఎటువంటి పరిహారం చెల్లించదు. దీనితో రిజర్వ్ ఫారెస్ట్ లో పులుల దాడుల వల్ల చనిపోయిన వారి మృత దేహాలను పొలాల్లోకి తీసుకుని వచ్చి పడేసి పులుల దాడిలో తమ వాళ్లు చనిపోయారంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. ఒకే తరహాలో ఏడు ఘటనలు జరడంతో అనుమానం వచ్చిన అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చెపట్టగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమ ఇంట్లోని వృద్దులను పులులకు ఆహారంగా ఎరవేస్తున్నట్టు గుర్తించారు. టైగర్ రిజర్వ్ లో పులలకు ఎదురెళ్లి ఆహారంగా మారుతున్నారని అక్కడ చనిపోయిన వారి మృత దేహాలను పొలాల్లోకి తీసుకుని వచ్చి పులులు తమ పొలాల్లోకి వచ్చి దాడి చేశాయంటూ ఫిర్యాదులు చేస్తున్నారని గుర్తించారు. గ్రామాల్లోని వృద్దులు తమంతట తాముగా పులులకు ఆహారం అయ్యేందుకు సిద్ధపడుతున్నట్టు అటవీ అధికారులు గుర్తించారు.

ఇప్పటివరకు జరిగిన ఏడు ఘటనపైనా అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల నుండి సేకరించిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు నివేదించినట్టు స్థానిక అధికారులు చెప్తున్నారు. ఈ ఘటనలపై సమగ్ర దర్యాప్తు చేయడంతో పాటుగా పేదరికంలో మగ్గుతున్న స్థానికులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలను గురించి కూడా నివేదించినట్టు వారు చెప్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *