బిడ్డలను సాకినట్టు మొక్కలను సాకాలి:కేసీఆర్

మొక్కలను సొంత బిడ్డల్లాగా చూసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కరీంనగర్‌లో హరితహారం కార్యక్రమం ప్రారంభించిన సీఎం కేసీఆర్.. అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. మొక్కలను జాగ్రత్తగా కాపాడుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. మనిషి జీవితం మొత్తం చెట్టుతోనే ముడిపడి ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోకుంటే భావితరాలకు మనం ఎంత ఆస్తిని సంపాదించి పెట్టినా లాభంలేదన్నారు. చెట్లను పెంచితేనే వర్షాలు పడతాయని దాని ద్వారా మనిషి మనుగడ సాధ్యపడతుందన్నారు.మెక్కలు నాటగానే సరిపోదని వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా మనపై ఉందన్నారు కేసీఆర్.మొక్కలు నాటడం కేవలం ప్రభుత్వ బాధ్యతగా భావించవద్దని దాన్ని ప్రతీ ఒక్కరూ స్వంత పనిగా భావించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు.
పట్టణ ప్రజలందరూ కలిసి వస్తే కరీంనగర్ ను లండన్ తరహాలో తీర్చిదిద్దుకుందామని కేసీఆర్ అన్నారు. ఇటీవలే 500 కోట్ల రూపాయలతో టూరిజం ప్రాజెక్టును మంజురు చేసిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చెశారు. లండన్ లోని థేమ్స్ నది తరహాలో కరీంనగర్ కు మానేరు ఉందని అదే మాదిరిగి నగరాన్ని తీర్చిదిద్దుకుందామన్నారు. హరితహారంలో భాగంగా కరీంనగర్ లో విరివిగా మొక్కలు నాటాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ లో పూర్తిగా పచ్చటి వాతావరణం నెలకొనాలని కేసీఆర్ అభిలషించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *