రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ

తెలంగాణ చరిత్రలో ఈ ఏడాది 2016-17లో పౌరసరఫరాల సంస్థ రైతుల నుంచి అంచనాలకు మించి ధాన్యాన్ని సేకరించి చరిత్ర సృష్టించింది. ఖరీఫ్‌, యాసంగిలో 5231 కొనుగోలు కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో కనీస మద్ధతు ధర (గ్రేడ్‌-ఎ క్వింటాల్‌కు రూ. 1510, సాధారణ రకం – క్వింటాల్‌కు రూ.1470)కు 10,93,192 మంది రైతుల నుండి 53.66 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది.

37 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని అంచన వేయగా పౌరసరఫరాల సంస్థ 37.14 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రూ. 5626.77 కోట్లు వెచ్చించి 6,93,020 రైతుల నుంచి సేకరించిందని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ శ్రీ సి.వి. ఆనంద్‌ తెలిపారు. ఇందుకోసం 9.25 కోట్ల గోనె సంచులను సమకూర్చడం జరిగిందన్నారు. ఈ ఏడాది ధాన్య సేకరణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నాల్గవ స్థానంలో నిలించింది. వరసగా పంజాబ్‌, ఛత్తీస్‌ఘర్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఉంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ధీటుగా తెలంగాణలో ఈ ఏడాది ధాన్యం సేకరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ పౌరసరఫరాల సంస్థ 55.32 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించగా, తెలంగాణ పౌరసరఫరాల సంస్థ ఇంచుమించుగా అదే స్థాయిలో 53.66 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించింది. ఇదే సమయంలో దక్షిణాది రాష్ట్రాలు కేరళలో 4.53 లక్షల మెట్రిక్‌ టన్నులు, తమిళనాడులో 2.11 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాయి.

”తెలంగాణ చరిత్రలో ఈ ఏడాదే అత్యధికం, ఇది ఒక రికార్డుగా చెప్పవచ్చు. ఇప్పటి వరకు 2013-14లో 3285 కొనుగోలు కేంద్రాల ద్వారా 24.82 లక్షల మెట్రిక్‌ టన్నులే అత్యధికం. ఇప్పుడు దీనికి రెండు రెట్లకుపైగా (222 శాతం ) అధికంగా కొనుగోలు చేయడం జరిగింది.

2010-11లో 1383 కేంద్రాల ద్వారా రూ.1936 కోట్లు వెచ్చించి 18.82 లక్షల మెట్రిక్‌ టన్నులు

2011-12లో 2019 కేంద్రాల ద్వారా రూ.1982 కోట్లు వెచ్చించి 17.91 లక్షల మెట్రిక్‌ టన్నులు

2012-13లో 2638 కేంద్రాల ద్వారా రూ 1773 కోట్లు వెచ్చించి 13.91 లక్షల మెట్రిక్‌ టన్నుల

ధాన్యాన్ని సేకరించడం జరిగింది.”

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది :

2014-15లో రూ. 3390.50 కోట్లు వెచ్చించి 3329 కేంద్రాల ద్వారా 24.28 లక్షల మెట్రిక్‌ టన్నులు

2015-16లో రూ. 3396.50 కోట్లు వెచ్చించి 3007 కేంద్రాల ద్వారా 23.56 లక్షల మెట్రిక్‌ టన్నులు

ఈ ఏడాది 2016-17లో 5231 కేంద్రాల ద్వారా రూ.8105.34 కోట్లు వెచ్చించి 53.66 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది.

గత ఏడాది 2015-16 యాసంగి సీజన్‌లో ఇదే సమయానికి 1286 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,75,713 మంది రైతుల నుండి 8.42 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది.

ఈ ఏడాది ఖరీఫ్‌లో 2178 కొనుగోలు కేంద్రాల ద్వారా 4,00,176 మంది రైతుల నుండి 16.52 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఇందుకుగాను రూ. 2478.57 కోట్లు ఆన్‌లైన్‌ ద్వారా రైతు ఖాతాలోకి జమచేయడం జరిగింది.

ఆన్‌లైన్‌ ద్వారా రైతు ఖతాలో రూ.8105 కోట్లు జమ :

దళారుల ప్రమేయం ఉండకూడదన్న ప్రధాన ఉద్ధేశంతో ఆన్‌లైన్‌ చెల్లింపులకు పౌరసరఫరాల శాఖ శ్రీకారం చుట్టింది. రికార్డు స్థాయిలో కనీస మద్ధతుధరకు సంబంధించిన చెల్లింపులను ఈ ఏడాది రూ.8105.34 వేల కోట్లను తొలిసారి ఆన్‌లైన్‌ ద్వారా రైతుల ఖాతాల్లో జమచేసి దేశానికి ఆదర్శంగా నిలిచింది.

దేశంలో ఎక్కడాలేని విధంగా ఇందుకోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (ఒపిఎంఎస్‌) సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలించింది.

ముందస్తు కార్యాచరణ :

ఈ ఏడాది అత్యధిక దిగుబడులు వస్తాయనే అంచనతో పౌరసరఫరాలశాఖ ముందుగానే అప్రమత్తమైంది.

ముఖ్యంగా యాసంగి సీజన్‌లో ధాన్యం సేకరణపై ఆ శాఖ కమిషనర్‌ శ్రీ సి.వి.ఆనంద్‌ ప్రత్యేక దృష్టి సారించారు. ధాన్యం అమ్ముకోవడంలో రైతులకు ఎలాంటి సమస్యలు ఎదురు కాకుండా ధాన్య సేకరణకు సంబంధించిన విభాగాలతో రాష్ట్రస్థాయిలో సమన్వయం చేసుకుంటూ, అదే విధంగా జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు…క్షేత్రస్థాయి వరకు ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా అందరితో సమన్వయం చేసుకున్నారు. కమిషనర్‌గారు స్వయంగా 10 జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపులు, రవాణా వంటి అంశాలను పరిశీలించారు. లక్ష్యాన్ని చేరుకున్నాం అని సి.వి. ఆనంద్ వివరించారు.
మంత్రులకు కృతజ్ఞతలు :

ఈ ఏడాది ముఖ్యంగా యాసంగిలో ధాన్యం సేకరణను విజయవంతంగా పూర్తిచేయడంలో సంబంధిత శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌, మార్కెటింగ్‌ శాఖమంత్రి శ్రీ టి. హరిశ్‌రావు సహకారం, తొడ్పాటు ఎంతో ఉందని సి.వి.ఆనంద్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *