సచిన్ రికార్డును అధికమించిన విరాట్

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డును అధికమించాడు. ఇప్పటి వరకు సచిన్ పేరిట ఉన్న చేజింగ్ లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్ మన్ గా సచిన్ పేరిట ఉన్న రికార్డును విరాట్ అధికమించాడు. వెస్ట్ ఇండిస్ తో జరిగిన ఐదో వన్డే లో సెంచరీ చేసిన విరాట్ చేజింగ్ లో ఇప్పటి వరకు 18 సెంచరీలు చేశాడు. దీనితో సచిన్ పేరిట ఉన్న 17 సెంటరీల రికార్డును విరాట్ అధికమించాడు. సచిన్ చేజింగ్‌లో 17 సెంచ‌రీలు చేయ‌డానికి 232 ఇన్నింగ్స్ అడాడు. అయితే విరాట్ మాత్రం ఈ ఫీట్ ను 102 ఇన్నింగ్స్ లోనే అధికమించాడు. వెస్టిండీస్ లో కెప్టెన్‌గా రెండు సెంచ‌రీలు చేశాడు విరాట్‌. ఈ ఘ‌న‌త సాధించిన తొలి భార‌త కెప్టెన్ కూడా కోహ్లియే. గ‌తంలో రాహుల్ ద్ర‌విడ్ కెప్టెన్‌గా ఒక సెంచ‌రీ చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *