గడ్డి అన్నవరంలో తొలి ఏకాదశి ప్రత్యేక పూజలు

తొలి ఏకాదశి సందర్భంగా పలు దేవాలయ్యాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక పారయణాలు, భజనలు జరుగుతున్నాయి. నగరంలోని ప్రముఖ క్షేత్రాల్లో ఒకటిగా పేరుగాంచిన దిల్ షుఖ్ నగర్ లోని సత్యనారాయణ స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గడ్డి అన్నవర క్షేత్రంగా పసిద్ది పొందిన ఈ క్షేత్రంలో తులసి మాలలు, నవధాన్యాలతో స్వామివారిని అలంకరించారు. అర్చకులు కంజర్ల వేంకట రమణ, అవసరాల శ్రీనివాస్ శర్మలు స్వామి వారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గడ్డి అన్నవర క్షేత్రంలో జరిగిన తొలి ఏకాదశి వేడుకలకు ఆలయ ఛైర్మన్ చిదర నాగేందర్, ప్రధాన కార్యదర్శి వక్కాలంక శ్రీనివాసరావు మంగపతిశర్మ సూరిశెట్టి వీరేశం బచ్చు సత్యనారాయణ కుమారస్వామి, ఎ.ఎస్.యు.ఎస్.అచార్య లు హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో మహిళలు విష్ణు సహస్రనామ పారాయణం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nfl jersey cheap cheap Philadelphia Eagles jersey