వర్మ ఎన్టీఆర్ చిత్రంలో విలన్ ఎవరు…?

తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిల్చిపోయిన నటసార్వభౌముడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా చలన చిత్రం తెరకెక్కబోతోంది. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు అధికారంగా ప్రకటించారు. చాలా కాలంగా ఎన్టీఆర్ జీవిత చరిత్రపు చిత్రం వస్తోందనే వార్తలు వచ్చినప్పటికీ ఇప్పుడీ వార్తలు వాస్తవరూపం దాల్చాయి. ఎన్టీఆర్ చిత్రాన్ని రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలుగు చలన చిత్ర సీమలోనూ, రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన్ను అభిమానించేవారే కాదు వ్యతిరేకించేవారు కూడా ఆయన ముద్రను అంగీకరించక తప్పదు. సినీ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి రికార్డు స్థాయిలో అధికారంలోకి వచ్చిన ఘన చరిత్ర ఆయన సొంతం.

ఎన్టీఆర్ సినీ జివాతానికి సంబంధించి పెద్దగా వివాదాలు ఏమీ లేనప్పటికీ ఆయన రాజకీయ జీవితంలో మాత్రం చాలా ఒడుదుడుకులున్నాయి. పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే పార్టీలోని స్వంత మనుషులే ఆయన్ను గద్దెదింపగా ప్రజా బలంతో తిరగి అధికారంలోకి వచ్చారు. అటు తర్వాత మలి దశలోనూ ఎన్టీఆర్ పై తిరుగుబాటు తప్పలేదు. రకరకాల కారణాల వల్ల స్వంత అల్లుడే ఆయన్ను పదవినుండి దింపే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ పై చిత్రం అంటే ఏఏ విషయాలను గురించి స్ప్రశిస్తారు అనేది కీలకాంశం. ఎన్టీఆర్ జీవిత చరిత్రపై గతంలో బాలకృష్ణ కూడా ఒక ప్రకటన చేసినప్పటికీ ఆ తరువాత మౌనంగా ఉండిపోయారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వారసులు ప్రస్తుతం రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఏపీ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా సినిమాలో సూపించేంత ధైర్యం రాంగోపాల్ వర్మ చేస్తారా…? ఎన్టీఆర్ బయోపిక్ లో ఆయనే హీరో మరి విలన్ ఎవరో మరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *