చంద్రాయాణ గుట్టలో తనిఖీలు పలువురి అరెస్ట్

హైదరాబాద్ పాతబస్తీలోని చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. భారీ ఎత్తున పోలీసు బలగాలు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ నేతృత్వంలో సుమారు 400 మంది పోలీసులు చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో సాదాలు జరిపారు. ముఖ్యంగా ఇంద్రానగర్, గౌస్ నగర్ లలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ హత్యాయత్నం కేసులో మహ్మద్ పహిల్వాన్ విడుదల అయిన తరవాత చంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ పై ప్రత్యేక దృష్టి పెడతామంటూ ప్రకటించిన పోలీసులు దీనికి అనుగుణంగా చర్యలకు ఉపక్రమించారు. ఈ తనిఖీల్లో పలు నేరాలతో సంబంధం ఉన్న ఆరుగురు పాత నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. 13 మంది అనుమానితులను కూడా పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 46 వాహనాలను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. చోరీలకు పాల్పడుతూ పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్న వారిని వదిలేది లేదని ఈ సందర్భంగా డీసీపీ సత్యనారాయణ చెప్పారు. అక్రమాలకు పాల్పడితే ఎవరినీ వదిలేదిలేదన్నారు. రెండు దొంగతనాలకు సంబంధించిన మిస్టరీని కూడా పోలీసులు ఈ కార్డన్ సెర్చ్ సందర్భంగా చేధించారు. అక్రమాలకు పాల్పడేవారు ఎవరైనా వదిలేది లేదని డీసీపీ స్పష్టం చేశారు. ఎవరనీ ఉపేక్షించేది లేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *