తెలంగాణ ఏర్పాటులో నాకూ భాగం ఉంది: మీరా కుమార్

తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే నాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మీరా కుమార్ అన్నారు. ప్రచారంలో భాగంగా హైదరాబాద్ కు వచ్చిన మీరా కుమార్ గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడార. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో తాను స్పీకర్ గా ఉన్న విషయాన్ని మీరా కుమార్ గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల కోరిక ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని అన్నారు. నాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల కోరినకను మన్నించి వారి కలను సాకారం చేసిందన్నారు. తెలంగాణ ఏర్పాటు లాంటి చారిత్రక ఘట్టంలో పాల్పంచుకునే అవకాశం తనకు దక్కిందని మీరా కుమార్ పేర్కొన్నారు. రాష్టపతి అభ్యర్థిగా 17 రాజకీయ పక్షాలు తనకు మద్దతు పలకడం పట్ల మీరా కుమార్ హర్షం వ్యక్తం చేశారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం కోసమే తాను పోటీ చేస్తున్నట్టు మీరా కుమార్ చెప్పారు. తాను ఒంటరిని కాదని తనకు మద్దతు ఇచ్చే వారు పెద్ద సంఖ్యలో ఉన్నట్టు అమె పేర్కొన్నారు. భావస్వేచ్ఛ కోసం తాను పోరాడుతున్నట్టు మీరా కుమార్ తెలిపారు. సిద్దాంతాలు, విలువల ప్రాతిపదికన ఈ ఎన్నికలు జరుగుతున్నాయని మీరా కుమార్ అన్నారు. తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా అన్ని వర్గాల వారిని కోరుతున్నానని చెప్పారు. తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా మజ్లీస్ పార్టీని కోరుతున్నట్టు మీరా కుమార్ వెల్లడించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఆత్మప్రభోధానుసారం ఓటు వేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *