జీఎస్టీ శకం ఆరంభం

భారత దేశ పన్నుల విధానంలో కొత్త శకం ఆరంభమైంది. సంవత్సరాలుగా వాయిదా పడుతూ వచ్చిన జీఎస్టీ విధానం ఎట్టకేలకు అమల్లోకి వచ్చింది. ఇక నుండి దేశవ్యాప్తంగా ఒకే పన్నుల విధానం అమలు కాబోతోంది. రాష్ట్రాల మధ్య పన్నుల విధానంలో ఎటువంటి వ్యత్యాసం ఉండదు. దేశం మొత్తం ఓకే పన్నుల విధానం అమల్లోకి వచ్చింది. పార్లమెంటు సెంట్రల్ హాల్ లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ , ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా అధికార అనధికార ప్రముఖల సమక్షంలో కొత్త పన్నుల విధానానికి రాష్ట్రపతి, ప్రధాని సంయుక్తంగా శ్రీకారం చుట్టారు. ప్రధాన విపక్షంతో పాటుగా వామపక్షాలు, తృణములు లాంటి పక్షాలు ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి హాజరుకాలేదు. జీఎస్టీకి తాము మద్దతు ఇస్తున్నప్పటికీ అది ణలు జరుపుతున్న తీరును నిరసిస్తూ ఈ పక్షాలు గౌర్హజరయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *