కార్పోరేట్ ఆఫీస్ కాదు-పోలీస్ స్టేషన్

DDPcGyPVwAAktaaDDPcGyPV0AAoKvM DDPcGyPVYAEYAZ8 DDPcGyRUwAEKgWj DDPVLGbVoAEDi4Z DDPVLGcV0AE4HUx DDPVLGcVwAM7Ho8 DDPVLGdUIAE1Sie

కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న భవనాలు… విరిగిపోయిన కుర్చీలు… చాలీచాలని భవనం… భూత్ బంగ్లాను తలపించే గదులు… పోలీస్ స్టేషన్ అంటే మన కళ్ల ముందు కదిలే చిత్రాలు ఇవే. అయితే ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు కూడా ఆధునిక హంగులు సమకూర్చుకుంటున్నాయి. కార్పోరేట్ ఆఫీస్ కి ఏ మామాత్రం తీసిపోని విధంగా పోలీస్ స్టేషన్ లు తయారవుతున్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో పాటుగా కార్పేరేట్ ఆఫీస్ కి ఏమాత్రం తీసిపోని విధంగా పోలస్ స్టేషన్ లు తయారవుతున్నాయి. పోలీస్ స్టేషన్ లు ఆధునికంగా తయారు అవడంతో ప్రజలు నిర్భయంగా ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తున్నారని అధికారులు చెప్తున్నారు. నగరంలోని పలు పోలీస్ స్టేషన్ లతో పాటుగా శివార్లలోని ఆదిబట్ల పోలీస్ స్టేషన్ కూడా ఆధునిక హంగులతో సిద్ధమయింది. ఈ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన చిత్రాలను మంత్రి కేటీఆర్ ప్రజలతో పంచుకున్నారు. పోలీస్ స్టేషన్ లను ఆధునీకరించడంతో పాటుగా సమర్థవంత పోలీసింగ్ ద్వారా క్రైం రేటును గణనీయంగా తగ్గించినట్టు కేటీఆర్ పేర్కొన్నారు. గత మూడు సంవత్సరాల్లో తెలంగాణలో క్రైం రేటు గణనీయంగా తగ్గిందని ఆయన వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *