అతి పురాతన మసీదు ధ్వంసం

ఇరాక్ లోని మోసుల్ నగరంలో ఉన్న అతి పురాతన అల్ నూరీ మసీదు ద్వంసం అయింది. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ మసీదు పూర్తిగా ధ్వంసం అయినట్టు తెలుస్తోంది. మోసూల్ నగరంపై పట్టు సాధించేందుకు అటు ఐసిస్ ఇటు ఇరాక్ దళాలు పోరాడుతున్నాయి. ఈ క్రమంలోనే 800 సంవత్సరాల నాటి మసీదు పూర్తిగా ద్వంసం అయింది. అత్యంత పురాతనమైన ఈ మసీదును ఐసిస్ పేల్చివేసిందని ఇరాకీ దళాలు చెప్తున్నాయి. అయితే ఈ మసీదును తాను పేల్చివేయలేదని సంకీర్ణ దళాల వైమానికి దాడుల్లో ఈ మసీదు పూర్తిగా ద్వంసమయిదని ఐసిస్ అంటోంది. ఈ ఆరోపణలను సంకీర్ణ దళలు ఖండిస్తున్నాయి. మసీదు ఉన్న ప్రాంతంలో తాము ఎటువంటి వైమానికి దాడులు నిర్వహించలేదని సంకీర్ణ దళాలు స్పష్టం చేస్తున్నాయి. ఐసిస్ ఈ మసీదును కూల్చివేసి నెపాన్ని ఇతరులపైకి నెడుతోందని సంకీర్ణ సేనలు ఆరోపిస్తున్నాయి.

ఇరాక్ లోని అత్యంత పురాతన మసీదుల్లో ఒకటైన దీన్ని 800 సంవత్సరాల క్రితం నూర్ అల్ దిన్ మహ్మద్ జంగీ ఆదేశాల మేరకు నిర్మించారు. ఈ మసీదులోని అతి ఎత్తైన స్థంబానికి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఈ మసీదు నిర్మించినప్పటి నుండే ఎంతో ప్రాముఖ్యం ఉంది. అటు తరువాత కూడా అల్ నూరీ మసీదు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. అమెరికా-ఇరాక్ యుద్ధ సమయంలోనూ ఈ మసీదు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇస్లామిక్ స్టేట్ నాయకుడు అబు బకర్ అల్ బాగ్దాది ఇదే మసీదులో మూడు సంవత్సరాల క్రితం తనను తాను కలీఫాగా ప్రకటించుకున్నాడు.

ఎవరికి వారు మసీదును తాము ద్వంసం చేయలేదని చెప్తున్నా అత్యంత పురాతన మసీదు మాత్రం పూర్తిగా ద్వంసం అయింది. అక్కడి పరిస్థితులను బట్టి చూస్తే ఐసిస్ ఈ మసీదును ద్వంసం చేసినట్టుగా కనిపిస్తోంది. మోసుల్ నగరంపై పట్టు సాధించుకునేందుకు తీవ్రంగా పోరాడుతున్న ఐసిస్ చివరకు మసీదును సైతం ధ్వసం చేసేందుకు వెనుకాడలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *