మీడియాకు చిక్కిన శిరీష మరో ఫోన్ సంభాషణ

బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. శిరీష కు చెందినదిగా చెప్తున్న మరో ఆడియో టేపు ఒకటి తాజాగా బయటికి వచ్చింది. నవీన్, నందు అనే ఇద్దరు వ్యక్తులతో మాట్లాడినట్టుగా ఉన్న ఈ ఆడియోలో ఉంది. గతంలో ఒక ఫోన్ సంభాషణ మీడియాకు చిక్కగా తాజాగా మరో సంభాషణ మీడియాకు చేరింది. ఇందులో శిరీష తనకు రాజీవ్ అంటే చాలా ఇష్టమని తనకు రాజీవ్ కు మధ్యలో తేజస్విని రాకుండా చూడాలంటూ తన మిత్రులు నవీన్, నుందులను కోరింది. రాజీవ్ ను ఎవరు ఏమన్నా అంటే సహించనని చంపేస్తానంటూ శిరీష చెప్పడం గమనార్హం. శిరీష మాట్లాడినట్టు చెప్తున్న ఆడియో తాము విడుదల చేయలదేని పోలీసులు చెప్తున్నారు. అయితే అవి మీడియాకు ఎట్లా చేరాయనేదానిపై మాత్రం స్ఫష్టత కరువైంది.

శిరీష పలు దఫాల్లో మాట్లాడిన సంభాషణలు ఆమె ఫోన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. దీనితో ఆమె ఫోన్ ను పోలీసులు ఫొరెన్సిక్ ల్యాబ్ కు పంపినట్టు సమాచారం. మరో వైపు ఆత్మహత్య చేసుకున్న రోజు శిరీష పై అత్యాచారం జరిగిందనే అనుమానులు వ్యక్తం అవుతున్నాయి. ఆమె దుస్తులపై ఉన్న రక్తపు మరకలు ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. ఫొరెన్సిక్ నివేదిక వస్తేకానీ అన్ని విషయాలు బయటపడే అవకాశాలున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *