we love you….

లీగ్ మ్యాచ్ లో దుమ్ముదులిపారు… పైనల్స్ లో దాయాదీ దేశాం తుక్కురెగ్గొడటారని అనుకాన్నాం… కానీ జరిగింది వేరు… మా బాధను గుండెల్లోనే దాచుకున్నాం… ఓడిపోయామన్న బాధ ఉంది కానీ ఆటగాళ్ల మీద కోపం లేదు… మీరు గెలిస్తే మేం సంబరాలు చేసుకుందాం అనుకున్నాం మీరు ఓడారు మా సంబరాలు వాయిదా పడ్డాయి. అన్ని రోజులు మనవి కాదు అన్ని మ్యాచ్ లలోనూ గెలవాలనేంలేదు. కానీ ఓడిపోయింది పాకిస్థాన్ తో కదా అదీ ఫైనల్ లో ఆశాలు ఆవిరయ్యేసరి కొంచెం బాధ కానీ మిమ్మల్ని ఏమీ అనం…వ్యూహాత్మకంగా మన టీం తప్పులు చేసిందనే నిపుణుల వాదనను విన్నాం కానీ మన జట్టులో వ్యాహాలు పన్నడంలో నిష్నాతులు ఉన్నారని వారి అంచనాలు తలకిందgలైన ఉంటాయని సరిపెట్టుకుంటున్నాం. మొదటి బ్యాటింగ్ తీసుకోకుండా పెద్ద తప్పుచేశారని మ్యాచ్ ప్రారంభం కాగానే కామెంటేటర్లు అన్న మాటలను పట్టించుకోలేదు… పిచ్ ను దృష్టిలో పెట్టుకుని మరో పెసర్ కు అవకాశం ఇచ్చి ఉండాల్సిందనే వాదనను పట్టించుకోలేదు మీ వ్యూహాలు మీకు ఉంటాయని సరిపెట్టుకున్నాం..

పాకిస్థాన్ ఆటగాళ్లు చెలరేగి ఆడినా… బౌలింగ్ కనీస స్థాయిలో లేకున్నా పెద్దగా పట్టించుకోలేదు. ఫీల్డింగ్ కూడా దారుణంగా ఉందన్న సంగతినీ పక్కనపడేశాం. చూస్తున్న మాకే ఇంత టెన్షన్ ఉంటే ఆడుకున్న మీకు మరెంత టెన్షన్ ఉంటుందో ఊహించలగం…భారీ టార్గెట్ ముందున్నా ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లతో నిండిని మన బ్యాంటింగ్ లైనప్ పై కొండంత ఆశ. సున్నాకే ఓపెనర్ వెనక్కి మళ్లినా వచ్చిన లైఫ్ ని సద్వినియోగం చేసుకోక ఆ తరువాతి బంతికే అవుటయిన కెప్టెన్ గారినీ ఏమీ అనం. ఘనత వహించిన మన ఆటగాళ్లు అందరూ క్యూలు కట్టినా ఏదో అద్భుతం జరుగుతుందనే ఆశతో అందరూ అవుటయ్యే వరకు మ్యాచ్ ను చూశాం. పాండ్యా మెరుపులు మెరిపిస్తే పొంగిపోయాం. ఏదైనా అద్భుతం జరుగుతుందా అని ఆశించాం… అయినా ఆశపడినట్టు ఏమీ జరగలేదు. ఘోరంగా ఓడిపోయాం… మాకు భాదే కానీ మీ పై కోపం లేదు…

పక్కదేశంలో వాళ్ల మాదిరిగా మీ ఇళ్లపై దాడులు చేయం… మీ ఫొటోలు తగులబెట్టం… కనీసం మా టీవీలను కూడా మేం పగలగొట్టుకోలేదు. ఎందుకంటే మేం బాగా పరిణితి చెందాం… మరో మ్యాచ్ కోసం ఎదురు చూస్తుంటాం… మిమ్మల్ని ప్రేమించడం మాత్రం మానుకోం… ఫైనల్ వరకు వచ్చాం కదా అదే గొప్పనుకుంటాం… గెల్చినపుడు సంబరాలు చేసుకోవడమే కాదు ఓడినపుడు కూడా మీ వెంటే ఉంటాం… మేం మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటా… వుయ్ లవ్ యు…

సగటు క్రికెట్ అభిమాని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *