నగర పోలీసుల హై అలెర్ట్

ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందంటూ వచ్చిన హెచ్చరికల నేపధ్యంలో  హైదరాబాద్ నగర పోలీసులు అప్రమత్తం అయ్యారు.  నగరంలోని పలు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఉగ్రదాడులకు ఆస్కారం ఉందంటూ నిఘా వర్గాల నుండి వచ్చిన సమాచారం మేరకు పోలీసులు అత్యంత అప్రమత్తతో వ్యవహరిస్తున్నారు. ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాం ఉందని పోలీసులకు నిఘా వర్గాల నుండి సమాచారం అందింది. భారత్ లోకి అక్రమంగా ప్రవేశించిన కొంత మంది ఉగ్రవాదులు దేశంలోని మెట్రో నగరాలను టార్గెట్ చేసుకుని విధ్వసం సృష్టించే అవకాశం ఉన్నట్టు నిఘా వర్గాల సమాచారం. హైదరాబాద్ తో పాటుగా ఢిల్లీ, ముంబాయి, కోల్ కతా, చెన్నై, బెంగళూరులలో కూడా పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆయా నగరాల్లో అనుమానితులు ప్రశ్నిస్తున్నారు. మెట్రో నగరాల్లో అప్రమత్తంగా ఉండాలంటూ నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఉగ్రదాడుల హెచ్చరికల నేపధ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు తప్ప ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని పోలీసులు చెప్తున్నారు. వదంతులు నమ్మవద్దని వారు అంటున్నారు. అనుమానిత వ్యక్తులు, వస్తువులకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు అందచేయాలని పోలీసులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *