హైదరాబాద్ లో నిల్చిన నీళ్లు-ట్రాఫిక్ తిప్పలు

హైదరాబాద్ నగర వాసులకు వర్షాకాలం కష్టాలు మొదలయ్యాయి. ఈ సీజన్ లో కురిసిన మొదటి వర్షానికే నగర రోడ్లన్ని జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లును ఎదుర్కొంటున్నారు. గురువారం తెల్లవారుజుమున కురిసిన భారీ వర్షానికి  రోడ్లపైకి నీరు వచ్చి చేరింది. దీనితో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ నిల్చిపోయింది. ట్రాఫిక్ జాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

  • మాదాపూర్-గచ్చీబౌలీ-రాయదుర్గం మార్గాంలో ట్రాఫిక్ జాం అయింది.
  • బల్కంపేట-బేగంపేట మార్గంలో ట్రాఫిక్ చాలా నెమ్మదిగా కదులుతోంది.
  • ఉప్పల్-హబ్సీగూడ-మెట్టుగూడ ప్రాంతంలో వాహనాలు పెద్ద సంఖ్యలో ఇరుక్కున్నాయి.
  • బేగంపేట-అమీర్ పేట మార్గంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.
  • నాచారంలో రోడ్డు కుంగిపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడంలేదు.
  • మలక్ పేట-చాదర్ ఘాట్ మార్గంలో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంది.

వీటితో పాటుగా చాలా మార్గాల్లో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది. దీనితో కార్యాలకు, వ్యక్తిగత పనుల కోసం వెళ్లే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. చాలా ప్రాంతాల్లో రోడ్ల పై నిల్చిన నీటిని తోడేశారు. జీహేచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో పనిచేస్తూ ట్రాఫిక్ ఇబ్బందులను దూరం చేసే పనిలో పడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *