తెలంగాణకు కరెంట్ కట్ చేస్తామంటున్న ఏపీ

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్  నుండి ప్రస్తుతం తెలంగాణకు సరఫరా అవుతున్న విద్యుత్ ను వెంటనే నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ చెల్లించాల్సిన బాకాయిలు వెంటనే చెల్లించాలని లేని పక్షంలో వెంటనే కరెంటు సరఫరాను నిలిపివేస్తామని ఏపీ జెన్ కో తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. రాష్ట్ర విభజన నుండి ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం ఏపీ కి 4,498 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని ఆ మొత్తాన్ని వెంటనే కట్టాలంటూ ఏపీ జెన్ కో తెలంగాణకు తాఖీదులు పంపింది. బకాయిలు చెల్లించని పక్షంలో వెంటనే కరెంటు సరఫరాను ఆపేస్తామంటూ హెచ్చరికలు కూడా పంపింది. అయితే దీనిపై స్పందించిన తెలంగాణ అధికారులు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సరఫరాను నిలిపివేసినా ఎటువంటి ప్రమాదం లేదని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ వద్ద మిగులు విద్యుత్ ఉందని ఏపీ కరెంట్ కట్ చేసినా వచ్చిన ఇబ్బందులు లేవని తెలంగాణ విద్యుత్ అధికారులు చెప్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *