ఇస్రో మరో ఘనత-అగ్రరాజ్యాల సరసన భారత్

అత్యంత బరువైన జీఎస్ఎల్వీ 3డీ 1 ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఈ తరహా ఉపగ్రహాల ప్రయోగాల కోసం ఇస్రో గత 18 సంవత్సరాలుగా కృషి చేస్తోంది. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా ఇస్రో ఈ ఘనతను సాధించింది. భారత్ కు ఈ సాంకేతిక పరిజ్ఞాన్ని అందనీయకుండా అగ్రరాజ్యాలు చేసిన ప్రయత్నాలను మన శాస్త్రవేత్తలు సవాలు తీసుకుని స్వంతగా అతి బరువైన ఉప గ్రహాన్ని మన శాస్త్రవేత్తలు నింగిలోకి ప్రయోగించగలిగారు. సరిగ్గా 16 నిమిషాల 20 సెకన్లలో జీశాట్ 19ని ఇస్రో కక్షలోకి ప్రవేశపెట్టింది. దీని బరువు 3316 కిలోలు. ఇంత బరువున్న ఉపగ్రహాన్ని నింగిలోకి పంపడం ద్వారా భారత్ ఇప్పుడు అగ్రరాజ్యాల సరసన చేరినట్టయింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై శాస్త్రవేత్తలు ఆనంద వ్యక్తం చేశారు. ఇస్రోలో పండుగ వాతావరణం నెలకొంది.జీశాట్‌-19 ఉపగ్రహంలో కేఏ బ్యాండు, కేయూ బ్యాండ్‌ ట్రాన్స్‌ఫాండర్లు ఉన్నాయి. దీని వల్ల ఇంటర్నెట్ సేవలు మరింత వేగం అవుతుంది. 4జీ టెక్నాలజీ మరింత మెరుగుపడుతుంది. అత్యంత అధునాతన జీశాట్-19 పది సంవత్సరాల పాటు సేవలను అందిస్తుంది.

ఇస్రో ప్రయోగం విజయవంతం కావడం పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడులు వేర్వేరు ప్రకటనల ద్వార హర్షం వెలిబుజ్జారు. మన శాస్త్రవేత్తలు భారత కీర్తి ప్రతిష్టలను మరింత పెంచారని వారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Philadelphia Eagles jersey cheap nfl jersey cheap