పాక్ మటాష్-భారత్ అభిమానుల జోష్

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాకిస్థాన్ ను చిత్తు చిత్తుగా ఓడించడంతో క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇంగ్లాండ్ లో జరిగిన మ్యాచ్ లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై భారీ తేడాతో గెలవడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్ కనీసం భారత్ కు పోటీ ఇవ్వలేకపోయిందని వాళ్లు గల్లీ క్రికెటర్ ల లాగా ఆడారని భారత అభిమానులు సంబరపడుతున్నారు.  బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని రంగాల్లో భారత జట్టు రెచ్చిపోయిందని దీనితో పాకిస్థాన్ కు చుక్కలు కనపించాయని అభిమానులు అంటున్నారు. భారత్ గెలుపుతో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమాలు పండుగ చేసుకుంటున్నారు. బర్మింగ్ హమ్ మ్యాచ్ లో భారత్ అన్ని రంగాల్లోనూ ఆధిపత్యం చలాయించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ వర్షం వల్ల కుదించిన నిర్ణీత 48 ఓవర్లలో  3 వికెట్లు కోల్పోయి 319 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(91), విరాట్ కోహ్లీ (81 నాటౌట్), శిఖర్ థావన్ (68), యువరాజ్ సింగ్ (53) పరుగులతో రాణించడంతో భారత్ భారీస్కోరు చేయగలిగింది. 320 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఏ దశలోనూ ఆటపై అదుపు సాధించలేకపోయింది. తడబడుతూ బ్యాటింగ్ చేసిన పాక్ 33.4 ఓవర్లలో 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాకిస్థాన్ ఈ మ్యాచ్ లో అన్ని రంగాల్లోనూ విఫలం అయింది. చెత్త బౌలింగ్, బ్యాటింగ్ తో పాటుగా ఆ జట్టు ఫీల్డింగ్ అత్యంత పేలవంగా ఉంది. భారత ఆటగాళ్లు ఇచ్చిన కీలక క్యాచ్ లను వదిలిన పాకిస్థాన్ దానికి భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వచ్చింది.

భారత్-పాక్ మ్యాచ్ లో భారత్ పూర్తి ఏకపక్షంగా  విజయం సాధించడంతో అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *