ప్రియాంక చోప్రాపై తీవ్ర విమర్శలు

ప్రముక సినీ నటి ప్రియాంక చోప్రా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీని జర్మనీ రాజధాని బెర్లిన్ లో కలిసిన ప్రియాంక చోప్రా మోడీతో భేటి సందర్భంగా వేసుకున్న దుస్తులు, ప్రధాని ముందు కాలు  మీద కాలు వేసుకుని కూర్చోవడం పై చర్చ జరుగుతోంది.  ప్రియాంక తాజాగా నటించిన బేవాచ్ సినిమా ప్రచారంలో భాగంగా జర్మనీలో పర్యటిస్తున్నారు. అదే సమయంలో జర్మనీలో ఉన్న ప్రధానిని ప్రియాంక కొద్దిసేపు కలిశారు. జర్మనీ ఛాన్స్ లర్ తో భేటీ తరువాత అక్కడి నుండి స్పేయిన్ కు వెళ్తున్న ప్రధానిని ప్రియాంక చోప్రా కలవడంతో పాటుగా ఆమె ప్రధానిని కలిసిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు దుమారం రేపుతోంది. ప్రధానిని కలిసిన సందర్భంగా ప్రియాంక  చిట్టిపొట్టి బట్టలు వేసుకోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. దీనికి తోడు ప్రధాని ఎదుట కాలుమీద కాలు  వేసుకుని కూర్చోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రధాని స్థాయిని వ్యక్తిని కలుకునే సందర్భంలో కనీస మర్యాదలు పాటించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నిస్తున్నారు.

తనపై కొంత మంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రియాంక చోప్రా మరింత రెచ్చిపోయినట్టే కనిపిస్తోంది. తన తల్లితో కలిసి  దిగిన చిట్టిపొట్టి డ్రస్ లతో ఉన్న ఫొటోను పోస్టు చేస్తూ ‘లెగ్స్‌ ఫర్‌ డేస్‌. ఇది జీన్స్‌ వల్ల వచ్చిన అందం.’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. దీనితో ఆమెపై మరిన్ని విమర్శలు వస్తున్నాయి. ప్రియాంక తన మూలాలు మర్చిపోతున్నారంటూ కొంత మంది గాటుగా విమర్శలు చేశారు. అయితే కొందరు  మాత్రం ప్రియాంకను వెనకేసుకుని వస్తున్నారు. ఆమె చేసిన దాంట్లో తప్పేంలేదంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *