కాబూల్ లో భారీ పేలుడు-50 మంది మృతి

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ మరోసారి రక్తమోడింది. బుధవారం ఉదయం జరిగిన భారీ పేలుడులో 50 మందికి పైగా మృతి చెందగా 70 మందికి పైగా గాయాలయ్యాయి. కాబూల్ లో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో జరిగిన ఈ విస్ఫోటనానికి భవనాలు ఊగిపోయాయి. అత్యంత తీవ్రమైన ఈ పేలుడు ధాటికి వందల మీటర్ల దూరంలోని భవనాలు కూడా ఊగిపోయినట్టు సమాచారం. రాయబారా కార్యాలయాలు ఎక్కువగా ఉండే ప్రాంతంలోని ఒక  కారులో పేలుడు పదార్థాలను ఉంచి దుండగులు పేల్చివేశారు. పేలుడు ధాటికి అనేక భవనాలు ధ్వంసం అయ్యాయి. 50 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 70 మందికి పైగా గాయాలయ్యాయి. జర్మన్ మిషన్ ఇన్ కార్యాలయం వద్ద ఈ పేలుడు జరిగింది. ఈ పేలుడులో భారత రాయబార కార్యాలయం కూడా దెబ్బతినింది. కార్యాలయంలోని భారత సిబ్బంది సురక్షితంగా ఉన్నట్టు విదేశీ వ్యవహారల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పేలుడు జరిగిన ప్రాంతానికి 400 మీటర్ల దూరంలోనే అమెరికా రాయబార కార్యాలయం ఉంది.

విదేశీ రాయబార కార్యాలయాలు ఉండే ఈ ప్రాంతంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. అయినా కారులో పేలుడు పాదార్థాలను అమర్చిన దుండగులు భారీ పేలుళ్లు జరిపారు. ఈ ఘాతకానికి ఒడిగట్టింది ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. పేలు తీవ్ర ఎక్కువగా ఉండడం, దీని ధాటికి భవనాలు ఊగిపోవడంతో తొలతు భూకంపం వచ్చిందని భావించారు. దానితో భవనాల నుండి బయటకు పరులుగు తీశార. ఆ తరువాత పేలుడు జరిగిందని గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *