నాటి అరగుండు ఉధ్యమకారుడే-నేటి కార్పోరేషన్ ఛైర్మన్

తెలంగాణ ఉధ్యమ సమయంలో ఒక వ్యక్తి అరగుండు, అర మీసంతో ఉధ్యమంలో చురుగ్గా పాల్గొనేవాడు. అతని వేషధారణ అతన్ని అతన్ని అందరికీ గుర్తుండేలా చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు సగం గుండు, సగం మీసం తోనే తిరుగుతానంటూ పతం పట్టిన ఆయన అట్లానే తిరిగాడు. ఆయనకు సంబంధించిన వార్త, ఫొటో తెలంగాణ వాదుల్లో విస్తృతంగా ప్రచారం అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. సగం మీసం, గుండు తోనే తెలంగాణ ఉధ్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆ వ్యక్తి మరెవరో కాదు తెలంగాణ రాష్ట్ర గిరిజన కో-ఆపరేటివ్ కార్పోరేషన్ ఛైర్మన్ గా ఎంపికైన గాంధీ నాయక్. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయన్ను గుర్తించిన కేసీఆర్ కార్పోరేషన్ ఛైర్మన్ పదవిని అప్పగించారు. తెలంగాణ వాదులను, తెలంగాణ కోసం పోరాడిన వారికి గుర్తింపు ఉంటుందని ప్రకటించిన కేసీఆర్ తన మాటలను నిలబెట్టుకున్నారని టీఆర్ఎస్ కార్యకర్తలు అంటున్నారు. నాయక్ లాంటి వ్యక్తికి పదవిని అప్పగించడం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Philadelphia Eagles jersey cheap cheap Eagles jerseys