బీజేపీ అగ్రనేతలకు బెయిల్

బాబ్రీమసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేతలకు బెయిల్ లభించింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న బీజేపీ సీనియర్ నేతలకు దీనితో వూరట లభించనట్టయింది. బీజేపీ అగ్రనేతలు ఎల్.కే.అధ్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి సహా 12 మంది నేతలకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పిన నేపధ్యంలో ఈ రోజు  లక్నో లోని సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణకు ప్రాధాన్యం లభించింది. అధ్వానీతో సహా ఇతర బీజేపీ సీనియర్ నేతలపై తీరిగి విచారణ జరపడానికి అనుమతి కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటీషన్ ను విచారించిన సుప్రీంకోర్టు విచారణకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే లక్నోలోని ప్రత్యేక న్యాయం స్థానం ఎదుట హాజరైన బీజేపీ  అగ్రనేతలకు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరికి 50వేల వ్యక్తిగత బాండ్ కింద బెయిల్ ను మంజూరు చేశారు. 

    తమపై నమోదైన అభియాలకు సంబంధించి బీజేపీ నేతల నుండి సీబీఐ సంతకాలు తీసుకున్నారు. బీజేపీ అగ్రనేతలు లక్నో కోర్టుకు హాజరైన సమయంలో బీజేపీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో కోర్టు వద్దకు చేరుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా కోర్టు పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *