కేరళా తీరాన్ని తాకిన రుతుపవనాలు

వేపవితో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని వార్తను అందించింది. కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు కేరళా తీరానికి చేరుకుని అక్కడి నుండి దేశవ్యాప్తంగా విస్తరించనున్నాయి. ఇప్పటికే దక్షిణ కేరళాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల రాకతో వర్షాలు మరింతగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కేరళా తీరాన్ని తాకిన రుతుపవనాలు జూన్ రెండవ వారం కల్లా తెలుగు రాష్ట్రాలకు చేరుకోనున్నాయి. జూన్ రెండవ వారం నుండి తెలుగు రాష్ట్రాల్లోవిస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉండడంతో రుతుపవనాల గమనం సాధరణంగా ఉందని అనుకున్న సమయానికి రుతుపవనాలు విస్తరిస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *