‘సూపర్’ అని బుక్కయిన యాంకర్ రవి

సినిమా ఆడియో ఫంక్షన్ లలో యాంకర్లుగా వ్యవహరించే వారు సెలబ్రెటీలు ఎవరేం మాట్లాడినా “సూపర్” అంటూ పొగడడం పరిపాటే. పాపం ఆ అలవాటే యాంకర్ రవి కి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఇటీవల ఓ సినిమా కార్యక్రమంలో సీనియర్ నటుడు మహిళలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆడవాళ్లని చలపతిరావు కించపర్చే విధంగా మట్లాడాడంటూ ఆయనపై మహిళా సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీనితో ఆయనపై కేసును నమోదు చేశారు పోలీసులు. అయితే ఈ కార్యక్రమంలో యాంకర్ గా వ్యవహరించిన రవిపై  కూడా కేసు నమోదయింది. చలపతి మహిళలపై చేసిన వ్యాఖ్యలను రవి సమర్థించాడంటూ అతనిపై కూడా కేసును నమోదు చేశారు. అసలు చలపతిరావు చేసిన వ్యాఖ్యలను పూర్తిగా అర్థం చేసుకోకుండానే యాధాలాపంగా రవి సూపర్ అంటూ వ్యాఖ్యానించాడని అతని సన్నిహితులు చెప్తున్నారు. మహిళలపై చలపతిరావు చేసిన వ్యాఖ్యలను రవి పూర్తిగా వినను కూడా లేదని సాధారణంగా కార్యక్రమానికి వచ్చిన అతిధులు ఏం మాట్లాడినా సూపర్ అంటూ పొగడడం అలవాటుగా మారిపోయిందని ఇప్పుడు అదే రవిని కష్టాల్లోకి నెట్టిందని వారంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

cheap Philadelphia Eagles jersey Philadelphia Eagles jersey china