ధోనీ కన్నా నేనేం తక్కువ అంటున్న బజ్జీ

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కన్నా నేనేం తక్కువ అంటున్నాడు టెర్మినేటర్ హర్భజన్ సింగ్. ఛాంపియన్స్ ట్రోఫీకి తనను ఎంపిక చేయకపోవడం పట్ల బజ్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత జట్టు ఎంపికలో ఒకరికి ఒక న్యాయం మరొకరి మరో న్యాయం లాగా ఉందని అన్నాడు. ధోనీ ఫాంలో లేకపోయినా అతను జట్టులో ఉండడం వల్ల జట్టులో ఇతర ఆటగాళ్ల మనోస్థైర్యం మెరుగుపడుతుందని, అతని వ్యహాలు జట్టుకు పనికి వస్తాయన్న సెలక్టర్ల వ్యాఖ్యలను బజ్జీ తప్పుబడుతున్నాడు. తానుకూడా సీనియర్ ఆగగాడినేనని, బౌలింగ్ తో పాటుగా బ్యాటింగ్ లోనూ పనికి వస్తానని, తనకూ విశేష అనుభవం ఉందని అయినా తన పేరును కనీసం పరిశీలించకపోవడంపై హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. జట్టులో ఎంపికలో ధోనీకి విశేష ప్రాధాన్యమిస్తున్న సెలక్టర్లు.. తనను మాత్రం విస్మరిస్తున్నారని అన్నాడు. ధోనీకి లభించినంత ప్రాధాన్యం తనకు దక్కడం లేదన్నాడు. తాను కూడా 19 ఏళ్ల పాటు భారత జట్టుకు సేవలందించానని అనేక మ్యాచ్ లలో మ్యాచ్ విన్నర్ గా నిలిచానని చెప్పుకొచ్చాడు. కొందరు ఆటగాళ్లనే ప్రత్యేకంగా చూడడం సమంజసంగాలేదంటున్నాడు హర్భజన్ సింగ్. ఐపీఎల్ లో రాణించినా తన పేరు కానీ, గౌతం గంభీర్ పేరు కానీ సెలెక్టర్లు కనీసం పరిశీలించకపోవడం పై బజ్జీ విస్మయం వ్యక్తం చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *