దారితెలియక తికమక-అమెరికాలో భారతీయుడి అరెస్ట్

ఎయిర్ పోర్టులో ఎటు వెళ్లలో తెలియక తికమక పడ్డ భారతీయుడు ఒకరు అమెరికాలో అరెస్ట్ అయ్యారు. నిషేధిక ప్రాంతంలో అనుమానస్పదంగా తిరుగుతున్నాడంటూ భారత్ కు చెందిన వారణాళి ఫణికుమార్ అనే వ్యక్తిని లాగార్డియా ఎయిర్ పోర్టులో పోలీసలు అదుపులోకి తీసుకున్నారు. అతను నిషేధిత ప్రాంతంలో ఐదు నిమిషాలకు పైగా సంచరించాడంటూ అరెస్టు చేశారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినందుకుగాను ఫణికుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నడంటూ స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. టర్మినల్ బి వద్ద భద్రతాపరమైన నిబంధనలు ఫణికుమార్ అతిక్రమంచాడని అతనిపై పోలీసులు అభియోగాలు మోపారు. ముందు జాగ్రత్త చర్యగా  టర్మినల్ ను పోలీసులు ఖాళీ చేయించారు.

తాను ఎటు వెళ్లలో తెలియక నిషేధిత ప్రాంతంలోకి వెళ్లానని ఫణికుమార్ చెప్తున్నాడు. తెలయకే ఆ ప్రాంతంలోకి అడుగుపెట్టానని ఇందులో ఎటువంటి దురుద్దేశాలు లేవని చెప్పాడు. ఫణికుమార్ పై ఇప్పటి వరకు ఎటువంటి క్రిమినల్ రికార్డులు లేకపోవడంతో పొరపాటున తాను ఆ ప్రాంతంలోకి వెళ్లనని చెప్తుండడంతో అధికారులు పూర్తి విచారణ జరుపుతున్నారు. విచారణ తరువాతే అతన్ని వదిలి పెడతామని చెప్తున్నారు. మరో వైపు నిషేధిక ప్రాంతంలో సరిగా విధులు నిర్వహించని భద్రతా అధికారులపై కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *