జన నేత సుధీర్ కుమార్

యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, మలక్ పేట శాసనసభ్యుడిగా సుపరిచితుడైన పి.సుధీర్ కుమార్ వర్థంతి నేడు. అనుచరులు, అభిమానులు సుధీర్ అన్నగా ముద్దుగా పిల్చుకునే ఆయన మలక్ పేట శాసన సభ్యుడిగా తనదైన శైలిలో పనిచేశారు. పార్టీలకు అతీతంగా అభిమానులను, మిత్రులను సంపాదించుకున్న సుధీర్ కుమార్ 2002లో అనారోగ్యంతో కన్నుమూశారు. 43 సంవత్సరాల చిరుప్రాయంలోనే సుధీర్ కుమార్ ఈ లోపాన్ని విడిచిపోయారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీలో కీలక నేత పి.శివశంకర్ కుమారుడిగా రాజకీయ  ఆరంగేట్రం చేసిన సుధీర్ కుమార్ యువజన కాంగ్రెస్ నాయుకుడిగా పేరు సంపాదించుకున్నాడు. అటు తర్వాత మలక్ పేట శాసన సభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎంపికైన ఆయన ఆ ప్రాంత అభివృద్ధికి తోడ్పడ్డారు. బలమైన అనుచర గణం ఉన్న నేతగా సుధీర్ కుమార్ కు మంచి పేరుంది. ఆయన  మరణించి 15 సంవత్సరాలు అయినా ఇప్పటికీ  సుధీర్ కుమార్ పేరును ఆ ప్రాంతంలోని ఆయన అనుచరులు నిత్యం  కలవరిస్తూనే ఉంటారు.

సుధీర్ కుమార్ సోదరుడు, రాజకీయ నేత,  పి.వినయ్  కుమార్ ఫేస్ బుక్ పేజీ నుండి…..

My brother Sudhir. Fifteen years today since he left. My parents never got over the extreme loss. Neither did I. I am the one who would have spent the maximum time with him. Travelling in rickshaw together to All Saints School, having lunch together, playing together before and after coming back home from school. And then HPS. Since we were in the same house – Nalanda, did not compete much against each other. But yes, we had Tennis matches ranged against each other to move to the higher court in Lady Hydari Club. Used to be fun time being with him, quarreling with him and those physical fights!
Miss you Sudhir. Be safe, wherever you are. Until we hopefully meet again. God Bless

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *