బయటికి వస్తే మాడిపోతారు

తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పటికీ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో నాలుగు జిల్లాల్లో ఎండ తీవ్ర మరీ ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరం అయితే తప్ప ఎండలో బయటికి రావద్దని, ఒక వేళ వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. చిన్న పిల్లలు, వృద్దుల  విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఉభయగోదావరి జిల్లాలతో పాటుగా గుంటూరు, కృష్ణా జిల్లాలో ఎండలు మండుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. సాధారణం కంటే ఐదు నుండి ఏడు డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణం లో తేమ లోకపోవడం వల్ల సూర్య కిరణాలు నేరుగా ప్రసరించి వేడి గాలులు తీవ్రంగా వీస్తాయని చెప్పింది. మధ్యాహన్నం సమయంలో వడగాల్పులు వీస్తాయంటూ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది.

ఆది, సోమవారాల్లో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకు మించి చేరుకోవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలుజారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు పంపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *