గుట్టలో భారీ అగ్నిప్రమాదం-100 గుడిసెలు దగ్ధం

యాదగిరి గుట్ట పట్టణ సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇందులో పలు గూడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదవశాత్తు జరిగిన ఈ  ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. రెండు ఆవులు మాత్రం చనిపోయాయి. ఆస్తి నష్టానికి సంబంధించిన  వివరాలు తెలియాల్సి ఉంది. యాదార్గి అభివృద్ధిగా భాగంగా చేపడుతున్న పనులను సాయి పవన్ కన్ స్ట్రక్షన్ సంస్థ నిర్వహిస్తోంది. ఈ పనుల కోసం గాను కోసం పశ్చిమ బెంగాల్, బీహార్, ఓడిశాల నుండి కూలీలను తరలించారు. వీరందరూ పట్టణ పరిధిలో తాత్కాలికంగా నిర్మించుకున్న గుడెసెల్లో నివాసం ఉంటున్నారు. కూలీలంతా పనులకు వెళ్లిన సంయంలో ఒక్కసారిగా మంటలు రేగి గుడిసెలు కాలిపోయాయి. మంటలు ఒక్కసారిగా వ్యాపించాయని ప్రత్యక్షసాక్షులు చెప్తున్నారు. గుడిసెల్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఒక గుడిసెలో రేగిన మంటలు వరుసుగా అన్ని గుడిసెలకు వ్యాపించాయని నిమిషాల వ్యవధిలోనే మంటలు వ్యాపించడంతో వాటిని అదుపు చేయడం సాధ్యపడలేదని ప్రత్యక్షసాక్షులు చెప్తున్నారు. ఈ ప్రమాదంలో వందకు పైగా గుడిసెలు కాలిపోయినట్టు స్థానికులు చెప్పారు. తమ గుడిసెలకు నిప్పంటుకున్న సమాచారంతో పరుగున వచ్చిన కూలీలు మంటలను అదుపు చేయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కొద్ది నిమిషాల్లోనే గుడిసెలు బూడిదగా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Philadelphia Eagles jersey cheap nfl jersey cheap