ముమ్మరంగా సహాయక కార్యక్రమాలు

       కొండచరియలు విరిగిపడి రోడ్డుపై చిక్కుకుని పోయిన తెలంగాణకు చెందిన వారిని పథీపహాడ్ లోని చిన జీయర్ ఆశ్రమంలో ఆశ్రయం కల్పించారు. మొత్తం 20 యాత్రికులు రోడ్డుపై చిక్కుకుని పోయి ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు. వీరింతా జగిత్యాల, ధర్మపురి మండలలాలకు చెందిన వారు. ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాల విష్ణు ప్రయాగ్ వద్ద విరిగినపడిన కొండ చరియల వల్ల పెద్ద సంఖ్యలో యాత్రికులు చిక్కుకునిపోయారు. రోడ్డు మార్గాన్ని పునరుద్దరించడానికి సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందటూ ముందుగానే అధికారులు హెచ్చరించడంతో కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు చెప్పారు. రోడ్డు మార్గాన్ని వీలైనంత త్వరగా బాగు పర్చి ట్రాఫిక్ క్రమబద్దీకరిస్తామని చెప్పారు. ప్రయాణికులకు ఎటువంటి అసౌౌకర్యం కలక్కుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పోలీసు, రెవెన్యూ అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. విపత్తు నియంత్రణ శాఖ కూడా వీరికి సహాయ పడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *