చార్ ధామ్ యాత్రపై తెలుగు రాష్ట్రాల ఆరా

ఉత్తరా ఖండ్ లో కొండ చరియలు విరిగిపడిన ఘటనపై తెలుగు రాష్ట్రాల అధికారులు అప్రమత్తం అయ్యారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించే పనిలో పడ్డారు. ఇప్పటి వరకు ప్రాణా లేదా ఆస్తి నష్టానికి సంబంధించిన ఎటువంటి వార్తలు రానప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆరా తీస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో  చార్ థామ్ యాత్రకు వెళ్తుంటారు. ఈ క్రమంలో  కొండ చరియలు విరిగి  పడి 15 వేల మంది ప్రయాణికులు  రోడ్డుపై చిక్కుకుని పోయినట్టు వస్తున్న వార్తలతో అధికారులు అప్రమత్తం అయ్యారు. చిక్కుకుని పోయిన వారిలో తెలుగు వాళ్లు ఎంత మంది ఉన్నారనే దానిపై సమాచారాన్ని సేకరిస్తున్నారు. విష్ణు ప్రయాగ వద్ద భారీ ఎత్తున కొండ చరియలు విరిగి పడినట్టు వార్తలు వస్తున్నాయి. దీనితో భద్రీనాద్ కు వెళ్లే రోడ్డు మార్గం  మూసుకుని పోయి వందలాది వాహనాలు రోడ్డు పైనే నిల్చిపోయాయి. ఇప్పటికే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. సాధ్యమైనంత త్వరలో రోడ్డు మార్గాన్ని పునరిద్దరిస్తామని అక్కడి అధికారులు చెప్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *