పాకిస్థానీకి కైఫ్ ఘాటు జవాబు

పాకిస్థానీకి భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. కులభూషణ్ జాదవ్ ఉరిని ఆపుతూ అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై సంతోషం వ్యక్తం చేస్తూ కైఫ్ ట్విట్టర్ లో పోస్టు పెట్టాడు. దీనిపై స్పందించిన పాకిస్థాన్ కు చెందిన వ్యక్తి ముందుగా నీ పేరులోని మహ్మద్ పేరును తొలగించుకోవాలంటూ రీ ట్విట్ చేశాడు. దీనిపై తీవ్రంగా స్పందించిన కైఫ్ ఇస్లాం మతానికి తామే ప్రతినిధులంగా చెప్పుకోవడాన్ని పాకిస్థాన్ మానుకోవాలంటూ గట్టిగా సమాధనం ఇచ్చాడు. ఇస్లాంకు రక్షకులుగా భావించడం మానుకోవాలని హితవు పలికాడు. తన పేరును గానీ, మతాన్ని కానీ మార్చుకోవాల్సిన అవసరం లేదని వాటిని తాను ప్రాణంగా భావిస్తానని చెప్పాడు. భారత్ వంటి సహనసీల దేశం మరొకటి లేదని కూడా కైఫ్ పేర్కొన్నాడు. తాను భారతీయుడినని అందుకు గర్విస్తున్నానంటూ గట్టిగా సమాధానం చెప్పాడు.

అటు మరో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా కులభూషణ్ జాదవ్ పై అంతర్జాతీయ  కోర్టు ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.  పాకిస్థాన్ ఇప్పటికైనా తన పద్దతి మార్చుకోవాలని హితువు పకగ్గా పలువురు పాకిస్థానీలు ఈ ట్వీట్ పై స్పందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *