ట్రంప్ కు పదవీ గండం…?

వివాదాస్పదుడిగా పేరు పొందిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను గద్దె దింపుతారా…? ఇప్పుడు ప్రపంచ మంతటా ఇదే హాట్ టాపిక్ గా మారింది. ట్రంప్ ను గద్దె దింపే అవకాశాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో రష్యా మద్దతు తీసుకున్నారంటూ వచ్చిన ఆరోపణలు ప్రస్తుతం ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి. దీనిపై అమెరికన్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడి ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్  రష్యా సహకారం తీసుకున్నారన్న ఆరోపణలపై  విచారణ జరుగుతోంది. ఈ కేసును విచారిస్తున్న ఎఫ్ బీ ఐ డైరెక్టర్ జేమ్స్ బి. కామే ను ట్రంప్ అర్థాతరంగా ఎఫ్ బి ఐ డైరెక్టర్ పదవి నుండి తప్పించారు. దీనిపై ట్రంప్ వ్యతిరేకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తును పక్కదారి  పట్టించేందుకే ట్రంప్ ఈ విధంగా ఎఫ్ బి ఐ డైరెక్టర్ ను పదవి నుండి తప్పించారనే విమర్శలు వెల్లువెత్తాయి. దీనితో ట్రంప్ పై  విచారణలో కేసు దర్యాప్తు బాధ్యతలను కోర్టు ఎఫ్ బి ఐ మాజీ అధికారి ముల్లర్ కు అప్పగించింది. ముల్లర్ ఈ కేసును దర్యాప్తు బాద్యతలు చేపట్టారు. ఈ కేసులో తీర్పు ట్రంప్ ఏ మాత్రం వ్యతిరేకంగా వచ్చినా ఆయనపై వేటు తప్పకపోవచ్చనే వార్తలు వస్తున్నాయి. రష్యాకు ఐఎస్ కు సంబంధించిన అత్యంత కీలక సమాచారాన్ని చేరవేశారనే ఆరోపణలు కూడా ట్రంప్  పై వచ్చాయి. అయితే ఆ ఆరోపణలను ట్రంప్ కొట్టి పారేశారు.  ఐఎస్ పై యుధ్దంలో భాగంగా సమాచారన్ని రష్యాకు ఇచ్చాం తప్ప అందులో ఎటువంటి దురద్దేశాలు లేవని అమెరికా అధ్యక్షులు  చెప్తున్నాడు. సమాచారన్ని రష్యాతో పంచుకునే అధికారం తనకుందని ట్రంప్ వాదిస్తున్నారు.

ట్రంప్ పై ప్రజల్లో కూడా వ్యతిరేకత ఎక్కువుతోందని పలు ఆన్ లైన్ సర్వే సంస్థలు ప్రకటిస్తున్నాయి. ట్రంప్ విధానాల పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని ట్రంప్  ను పదవి నుండి దింపేయాలని అమెరికా ప్రజల్లో ఎక్కువ శాతం మంది కోరుతున్నాయని సర్వే సంస్థలు చెప్తున్నాయి. అయితే అభిశంసన ద్వారా ఇప్పటి వరకు ఏ అమెరికా అధ్యక్షుడిని గద్దే దింపిన దాఖలాలు లేవు. అమెరికా చరిత్రలో మొత్తం నలుగురు అధ్యక్షుల అభిశంసన పై అమెరికన్ కాంగ్రెస్  లో చర్చ జరగ్గా అందులో నిక్సన్ మాత్రం అభిశంసన  అశం చర్చలో ఉండగానే తన పదవికి రాజీనామా చేశారు. ఇతర అధ్యక్షులపై అభిశంసన అంశం వీగిపోయింది. అమెరికా అధ్యక్షుడిని పదవి లో నుండి దింపే అధికారం అమెరికన్ కాంగ్రెస్ కు ఉంది. అయితే ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ.  అమెరికన్ కాంగ్రెస్ లోని హౌస్ ఆఫ్ రిప్రజెంటీవ్స్ తో  పాటు సనెట్ కూడా అభిశంసనకు ఆమోదం వేస్తేనే అమెరికా అధ్యుడిని పదవి నుండి తప్పించ వచ్చు. అయితే రెండు సభల్లోనూ ఓటింగ్ లో  సాధారణ మేజార్టీ వస్తే సరిపోదు. పూర్తి మెజార్టీ వస్తేనే అభిశంసనకు వీలు కలుగుతుంది.

అమెరికన్లకే మొదటి ప్రధాన్యం అంటూ ప్రచారం మొదలు పెట్టినప్పటి నుండీ టంప్ర అటు అమెరికాలోనూ ఇటు ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో వ్యక్తిగా నిల్చారు. ట్రంప్ కు మద్దతుగా నిలుస్తున్న వారికంటే ఆయన్ను వ్యతిరేకిస్తున్నవారే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. హిల్లరీతో హోరాహోరీగా ఎన్నిక్లలో తలపడిన ట్రంప్ ఎన్నికల ప్రచారం నాటి నుండే వివాదాస్పద వ్యాఖ్యలతో అందరి దృష్టిని ఆకర్షించారు. అమెరికన్ మహిళలపట్ల, అమెరికాలో నివసిస్తున్న వలస దేశస్తుల పట్ల, చివరకి అమెరికా నల్ల జాతీయులపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసింది. అమెరికా అధ్యక్ష ఎన్నిక్లో అనూహ్యంగా విజయం సాధించిన ట్రంప్ ఆ  తరువాత తీసుకున్న అనేక నిర్ణయాలు సంచలనం రేపాయి. ఆయన తీసుకున్న నిర్ణయాల అమలుపై కోర్టు స్టే విధించినప్పటికీ ట్రంప్ తన దూకుడును ఏ మాత్రం తగ్గించలేదు. తాజాగా ట్రంప్ కు పదవీ గండం ఉందంటూ జరుగుతున్న ప్రచారం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *