కేంద్ర మంత్రి దవే ఆఖస్మిక మృతి

కేంద్ర మంత్రి అనిల్ మాధవ్ దవే (61) హఠాత్తుగా మృతి చెందారు. దవే కేంద్ర మంత్రి వర్గంలో పర్యావరణ, అటవీశాఖల బాధ్యతలను నిర్వహిస్తున్నారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో గత కొద్ది రోజులుగా దవే బాధపడుతున్నప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నఆయన హఠాత్తుగా మృతి చెందారు. ఒంట్లో కొద్దిగా నలతగా ఉందని చెప్పడంతో దవేను ఆయన కుటుంబ సభ్యులు ఢిల్లీ ఎయిమ్స్ కు తీసుకుని వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. మధ్యప్రదేశ్ నుండి ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిధ్యం  వహిస్తున్న దవే ప్రధాని నరేంద్ర మోడీకి సన్నిహితుడిగా పేరు పొందారు. గురువారం ఉదయం దవే కన్నుమూయగా బుధవారం సాయంత్రం ఆయన మోడీని కలిశారు.

1956 జులై 6న మధ్యప్రదేశ్ లోని బాద్ నగర్ లో జన్మించిన దవే గుజరాతీ కళాశాల నుండి ఎం.కాం చేశారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా సుపరిచితుడైన దవే ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో చిరగ్గా పాల్గొన్నారు. నర్మాదా  నది సంరక్షణ ఉధ్యమంలో దవే చురుగ్గా పాల్గొన్నారు.  పర్యావరణం పై మంచి అవగాహన ఉన్న దవేను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్న మోడీ పర్యావరణ మంత్రిత్వ శాఖను అప్పగించారు. దవే మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఆయన బుధవారం తనతో పలు విషయాలపై చర్చించారని ఒక్క రోజులోనే ఆయన తమ నుండి దూరం కావడం బాధను కలిగిస్తోందని మోడీ పేర్కొన్నారు. ఆయన హఠాన్మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు మంత్రులు, పార్టీ కార్యకర్తలు దవే మృతిపై విచారం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *