బ్యాంక్ గా మారుతున్న పేటీఎం

ప్రస్తుతం ఈ వాలెట్ లో అగ్రగామిగా ఉన్న పేటియం ఇప్పుడు బ్యాంకు గా మారనుంది. పేటీఎంకు ఆర్బీఐ అన్ని అనుమతులను ఇచ్చింది. మే 23 నుండి పేటిఎం బ్యాంకు ఆవిర్భవించనుంది. బ్యాంకింగ్ కార్యకలాపాలు సాగించేందుకు పేటిఎంకు ఆర్బీఐ అనుమతులు ఇవ్వడంతో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ గా మారుతోంది. ఈ విషయాన్ని పేటిఎం సంస్థ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. విజయ శేఖర్ శర్మ పేరుతో రిజర్వ్ బ్యాంక్ అనుమతులు మంజూరు చేసింది. ప్రస్తుతం పేటియంకు 21.8 కోట్ల మంది వినియోగదారులన్నారు. ఈ వ్యాలెట్ ను పేటిఎం బ్యాంకుకు బదిలీ చేయనున్నారు. అయితే పేటీఎం బ్యాంకులో విలీనానికి పేటిఎం వినియోగదారులు అంగీకరించని పక్షంలో ఆ విషయాన్ని పేటీఎం సంస్థకు తెలిపితే వారు సదరు ఖాతాలోని మొత్తాన్ని వారి బ్యాంకుల్లో జమ  చేస్తారు. మే 23వ తేదీ లోపుగా వినియోగదారులు పేటిఎంకు ఈ విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది.

పెద్ద నోట్ల రద్దు తరువాత బాగా లాభపడ్డ వాటిలో ప్రధానంగా పేటిఎం ఒకటి. ఈ వాలెట్ లో అగ్రగామిగా ఉన్న పేటిఎం పెద్ద నోట్ల రద్దు అవకాశాన్ని అందిపుచ్చుకుంది. నోట్ల రద్దుతో ఏర్పడిన నగదు కొరతను తనకు అనుకూలంగా మార్చుకుని భారీగా వినియోగదారులను చేర్చుకుంది. ఇతర ఈ వ్యాలెట్ సంస్థలకు అందనంత దూరంలోకి పేటిఎం దూసుకుని పోయింది. ఇటీవల కాలంలో భారీగా లాభాలను కూడగట్టుకున్న పేటీఎం ఇప్పుడు బ్యాంకింగ్  రంగంలోకి అడుగుపెట్టనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *